Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home National మహారాష్ట్రలో కొనసాగుతోన్న పోలింగ్

మహారాష్ట్రలో కొనసాగుతోన్న పోలింగ్

by Rama
మహారాష్ట్రలో కొనసాగుతోన్న పోలింగ్

మహారాష్ట్రలో కొనసాగుతోన్న పోలింగ్

యావత్ దేశం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు-2024 పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య రాష్ట్రంలోని మొత్తం 288 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. అధికార బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి.. విపక్షాలతో కూడిన మహా వికాస్ అఘాడి కూటమి ప్రధానంగా తలపడుతున్నాయి. మొత్తం 4 వేల 136 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 2 వేల 86 మంది స్వతంత్ర అభ్యర్థులు కావడం గమనార్హం. 2019లో 3వేల239 మంది అభ్యర్థులు పోటీ చేయగా… ఈసారి అభ్యర్థుల సంఖ్య ఏకంగా 28 శాతం పెరిగింది.దాదాపు 150 నియోజక వర్గాల్లో రెబల్స్ పోటీలో ఉన్నారు. మహాయుతి, మహా వికాస్ అఘాడి కూటముల అభ్యర్థులకు రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. పొత్తులో భాగంగా టికెట్ దక్కని చాలా మంది నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగారు. ఒకే దశలో పోలింగ్ జరుగుతుండడంతో ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను కూడా మోహరించారు. ఒక్క ముంబై నగరంలోనే ఏకంగా 30 వేల మంది పోలీసులను రంగంలోకి దించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.
    హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా దేశంలోకి చొరబడిన వీరు… కొంతకాలంగా ఇక్కడే ఉంటూ…
  • స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
    విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
  • మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.
    మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు లక్ష…
  • కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.
    కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో చిన్నారితో వెళ్లిన పెంపుడు కుక్క తోట నుంచి తిరిగొచ్చిన తర్వాత మృతి చెందడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి జాహ్నవి వెంట వెళ్లి తిరిగి వచ్చిన కుక్క.. రెండ్రోజులుగా…
  • ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.
    వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమ‌వుతున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్‌, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ,…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

023285
Total views : 141715

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.