114
చంద్రబాబునాయుడు నివాసంలో మూడురోజులుగా చేస్తున్న రాజశ్యామల యాగం ముగిసింది. శుక్రవారం నుంచి నేటి వరకు మూడు రోజుల పాటు యాగం వైభవంగా జరిగింది. గుంటూరుకు చెందిన వేదపండింతులు పి.శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో యాగం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది రిత్వికులు చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల చేత పలు పూజాక్రతువులు నిర్వహించారు. మూడో రోజు ఈ మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ యాగం ముగిసింది. యాగంలో పార్టీ కార్యాలయ సిబ్బంది కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నారు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.