Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Political సాగునీటి ప్రాజెక్టులపై రేవంత్ సమీక్ష

సాగునీటి ప్రాజెక్టులపై రేవంత్ సమీక్ష

by Satya
సాగునీటి ప్రాజెక్టులపై రేవంత్ సమీక్ష

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరు నెలల్లో వీలైనంత ఆయకట్టును సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు. ఈ వరుసలో రాబోయే రెండేండ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ శాఖకు దిశా నిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు నిర్ణీత గడువుతో పాటు లక్ష్యాలను నెరవేర్చందుకు వీలుగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని చెప్పారు. అయిదేండ్లకు ఆరేండ్లకు పూర్తి కాని ప్రాజెక్టులపై దృష్టి పెట్టి అక్కడ నిధులు ఖర్చు చేస్తే లాభం లేదని అన్నారు. ఇప్పటికే 75 శాతం, అంతకు మించి పనులు చేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే వచ్చే ఖరీఫ్ లోగా మరింత ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశముందని సీఎం తెలిపారు. అటు గోదావరి బేసిన్, ఇటు కృష్ణా బేసిన్ లో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టులకు నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందించే ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లుల చెల్లింపులు చేయాలని చెప్పారు. ఇక పనులు పూర్తి చేసేందుకు ఉన్న అడ్డంకులు, అవరోధంగా ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రధానంగా విద్యుత్ విభాగంతో కొన్ని బిల్లుల చెల్లింపుల సమస్యలున్నాయని అధికారులకు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇతర విభాగాలతో సమన్వయం లోపిస్తే పనులు ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదని, వెంటనే ట్రాన్స్​కో, జెన్​కో , డిస్కంలతో ఇరిగేషన్ విభాగం జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.
    సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వైద్య చర్యలన్నీ తీసుకోవాలని ప్రభుత్వానికి…
  • పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.
    పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్ను జిల్లాలో ఉన్న మిర్‌యాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ పరిసరాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా..డజన్ల సంఖ్యలో భద్రతా సిబ్బంది…
  • విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.
    విశాఖపట్నంలో సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో పెను ప్రమాదం తప్పింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడగా… ఏడుగురు మత్స్యకారులు మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, బోటు, వల పూర్తిగా…
  • రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా.
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కేటీఆర్.. ప్రస్తుతం…
  • డిసెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ “ఫౌజీ”.
    ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ “ఫౌజీ”. ఈ క్రేజీ మూవీ రిలీజ్ డేట్ ను ఈ రోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. అజాతపర్వం ముగిసింది, ది రెబలియన్ ప్రారంభమైంది అంటూ డిసెంబర్ 3న ఫౌజీ సినిమాను…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

040913
Total views : 212366

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: