Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home TelanganaKarimnagar సింగరేణి భూముల్లో మట్టి అక్రమ రవాణా చోద్యం చూస్తున్న అధికారులు..

సింగరేణి భూముల్లో మట్టి అక్రమ రవాణా చోద్యం చూస్తున్న అధికారులు..

by Rama
Singareni

పెద్దపల్లి జిల్లా సింగరేణి (singareni) సంస్థ రామగుండం (Ramagundam) ఏరియా వన్ పరిదిలోని ముస్త్యాల, సుందిల్ల శివారు భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. జెసిబిలు, ట్రాక్టర్లు ద్వారా నిత్యం యదేచ్చగా మట్టిని రవాణా చేస్తున్న స్థానిక సింగరేణి అధికారులు, రెవిన్యూ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా సింగరేణి స్థలాల్లొ నుంచి మట్టిని తరలిస్తున్న రెవిన్యూ అధికారులు కానీ, సింగరేణి అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

దీంతో ఇదే అదునుగా భావించిన మట్టి మాఫియా యధేచ్ఛగా మట్టిని రవాణా చేస్తూ లక్షల రూపాయాల విలువ గల మట్టిని అడ్డగోలుగా తరలిస్తున్నారు. స్థానిక అధికారుల తీరును ప్రజలు తప్పుబడుతున్నారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు తీరు మార్చుకొని, మట్టిని రవాణా చేస్తున్న అక్రమార్కులపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
    దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • 22ఏపై బీజేపీ దీక్షలు.
    భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: