ప్రపంచంలోనే ఆధ్యాత్మిక రాజధానిగా పిలవబడే తిరుపతి నుంచి వైయస్సార్సీపి ఎమ్మెల్యే అభ్యర్థి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డిని తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే, టిటిడి బోర్డు చైర్మన్ తనయుడు గానే కాకుండా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకొని రాష్ట్రం మొత్తం తిరుపతి వైపు చూసే విధంగా గత రెండు సంవత్సరాలలో మాస్టర్ ప్లాన్ల రోడ్లతో తిరుపతిని ట్రాఫిక్ ఫ్రీ ప్రాంతంగా తీర్చిదిద్దుతూ.. తిరుపతిలోని ప్రజలకు ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తిరుపతిని ఓ ఐటి హబ్ గా మార్చుతానని తిరుపతి వైఎస్సార్సీపీ ఇంచార్జ్ భూమన అభినయ రెడ్డి అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి
నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఉలవపాడు ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఎంపీడీవో ఎన్. విజయ అధ్యక్షతన గురువారం పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి విచ్చేసి వృద్ధాప్య మరియు వితంతు, వికలాంగులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మానుగుంట మాట్లాడుతూ పెన్షన్లకు 23 వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని ఆయన అన్నారు. గురువారం వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమం వేలాది మంది సామాజిక పింఛన్ లబ్ధిదారుల సమక్షంలో జరిగింది. సమాజంలోని వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు పని చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పింఛన్ల పెంపు వల్ల జగన్మోహన్ రెడ్డి సామాన్యుల గుండెల్లో గుడి కట్టుకుని ఉన్నారన్నారు. వయోవృద్ధులను మానవతా దృక్పథంతో ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 60 లక్షల పై చిలుకు సామాజిక పింఛన్ దారులు పింఛన్ తీసుకుంటున్నారని, ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే రెండు రెట్లు అధికమని ఎమ్మెల్యే వివరించారు.
కొడవలూరు మండల కార్యాలయంలో కొత్తగా మంజూరైన 117 పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. కొడవలూరు మండలంలో 8 తరగతి చదువుతున్న విద్యార్థులకు 350 ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ పెన్షన్ కానుక కింద నెల్లూరు జిల్లాలో కొత్తగా 4 408 పెన్షన్లు మంజూరయ్యాయి. జగన్మోహన్ రెడ్డి జిల్లా మొత్తం మీద 3,19, 952 పెన్షన్లను అందిస్తున్నారు. ప్రతి నెల పెన్షన్ల కొరకు 95 కోట్ల 54 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కొడవలూరు మండలంలో కొత్తగా 117 పెన్షన్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు మండలంలో 6,854 పెన్షన్లకు గాను నెలకు రెండు కోట్ల నాలుగు లక్షల తొంభై ఆరువేల రూపాయలను ఖర్చు పెడుతున్నారు. ప్రతి విద్యార్థికి 33,000 విలువ చేసే ట్యాబ్లలను బైజుస్ కంటెంట్‌తో కలిపి అందిస్తున్నారు. మూడు నెలల్లో ఎలక్షన్ వస్తున్నాయని రకరకాల వేషాలతో జనాల్లో తిరుగుతూ ఇతర పార్టీల వాళ్లు డబ్బులు ఖర్చు పెడుతున్నారని, వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని ఫ్యాన్ గుర్తుకి ఓటెయ్యాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పిన విధంగా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 3000 రూపాయలు పెన్షన్ అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమమే టిడిపి లక్ష్యమని, వారికి తాము అన్ని విధాల అండగా నిలబడతామని రాజంపేట తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. పండుగ సమీపిస్తున్న వేళ పారిశుద్ధ కార్మికులు పడుతున్న అవస్థలు చూసి చలించిపోయిన ఆయన తన కార్యాలయంలో 95 మంది పారిశుధ్య కార్మికులకు నాణ్యమైన 25 కిలోల బియ్యం బస్తాలుతో పాటు టీ షర్టులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మరచిపోయారని అన్నారు. కార్మికులకు అండగా నిలబడిన ఘనత టిడిపిదేనని, గతంలో కూడా చంద్రబాబు నాయుడు పాలనలో వారికి రూ 6 వేలు వేతనం పెంచడం జరిగిందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ కార్మికులు గత ఎనిమిది రోజులుగా పండుగ, పబ్బం అనుకోకుండా రోడ్డులెక్కి సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి కనీస చలనం కూడా లేదని మండిపడ్డారు. రాష్ట్రం సుందరంగా ఉండాలన్నా, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రధాన భూనిత పోషించేది పారిశుధ్య కార్మికులేనని, వారి కష్టాలు, న్యాయమైన డిమాండ్లు పెడచెవిన పెడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని, తమ ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జీతాలు పెంచాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉలవపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని, ఉలవపాడులో అంగన్వాడీల సమ్మె కొనసాగుతూనే ఉంది. కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం శిబిరానికి వెళ్లి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లోనూ.. చంద్రబాబు నాయుడు అంగన్వాడీలకు రెండుసార్లు జీతాలు పెంచారని గుర్తు చేశారు. కానీ అనేక ఆశలు చూపి, వారి చేత ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక లక్షలాది అక్క చెల్లెమ్మలను మోసం చేశారని విమర్శించారు. తెలంగాణలో కంటే అదనంగా జీతాలు పెంచుతానని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడమ తిప్పారని నాగేశ్వరావు అన్నారు. ఒకసారి మాత్రమే వెయ్యి రూపాయలు పెంచి, వారికి సంక్షేమ పథకాల అమలులో కోత విధించారని మండిపడ్డారు. ఉద్యోగులకు తమ సమస్యలు చెప్పుకునే హక్కు ఉంటుందని, కానీ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల సమ్మెపై ఉక్కుపాదం మోపి రకరకాలుగా బెదిరించడం దుర్మార్గమని నాగేశ్వరరావు అన్నారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో అంగన్వాడీలకు సంబంధించిన అన్ని సమస్యలను చంద్రబాబు నాయుడు గారు పరిష్కరిస్తారని నాగేశ్వరరావు తెలిపారు. ఎలాంటి షరతులు విధించకుండానే, మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రతి మహిళ కుటుంబానికి అందజేస్తారని వివరించారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్యక్రమం జరగగా, మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు అంచుపోగు వాసు, ఎంపీటీసీ దార్ల యలమందమ్మ, క్లస్టర్ ఇంచార్జ్ లు బెల్లం కృష్ణమోహన్, పోలుబోయిన శ్రీనివాసులు, సుదర్శి శ్రీనివాసులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 22వ రోజు అంగన్వాడీలు రోడ్డుపై దున్నపోతు కు మెమోరాండం ఇచ్చి వినూత్న నిరసన తెలిపారు. సీఎం డౌన్ డౌన్ మాట తప్పను మడమ తిప్పను అన్న సీఎం మాట తప్పాడు మనిషి ముఖం తిప్పాడు అనే నినాదాలతో రోడ్డుపై నిల్చోని అంగన్వాడీలు హోరెత్తించారు. దున్నపోతు మేము ఇచ్చిన మెమోరాండమ్ స్వీకరించి మాపై కృప చూపిందని, ఈ గుడ్డి ప్రభుత్వం 22 రోజులుగా అంగన్వాడీ అక్కచెల్లెళ్లు ఇల్లు వాకిళ్లు వదిలి రోడ్డుపై కూర్చొని ధర్నాలు చేస్తుంటే దున్నపోతుపై వర్షం కురిసినట్లుగా ఉందని ఇకనైనా మా డిమాండ్లు నెరవేరుస్తారని ఆశిస్తున్నామని వారు అన్నారు. లక్ష అరు వేల పై చిలుకు ఉన్న అంగన్వాడీల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ 22 రోజుల నుండి మేము సమ్మెలు దీక్షలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమకుట్టినట్లు అయినా లేదని, అంగన్వాడీల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి మాకెంతో బాధ కలిగిస్తుందని వారు అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడిల పట్ల దయ చూపి డిమాండ్లను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడిలపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని వారన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడిల డిమాండ్లను పరిష్కరించాలని వారు అన్నారు.
బాపట్లలో 15వ రోజు అంగన్వాడిలు రోడ్డుపై నల్ల బెలూన్లతో వారి నిరసనను తెలియజేసారు. సీఎం డౌన్ డౌన్ అన్న నినాదాలతో మాట తప్పను మడమ తిప్పను అన్న సీఎం మాట తప్పాడు. మనిషి ముఖం తిప్పాడు అనే నినాదాలతో రోడ్డుపై నిల్చోని అంగన్వాడీలు హోరెత్తించారు. బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 15వ రోజు అంగన్వాడీలు నల్ల బెలూన్లతో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసు నుండి పాత బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి నల్ల బెలూన్లు పాత బస్టాండ్ సెంటర్ లో వదిలి నిరసన తెలిపారు. లక్షపై చిలుకు ఉన్న అంగన్వాడీల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం అని వారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ 15 రోజుల నుండి మేము సమ్మెలు, దీక్షలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమకుట్టినట్లు అయినా లేదని, అంగన్వాడీల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి మాకెంతో బాధ కలిగిస్తుందని వారు అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడీల పట్ల దయ చూపి వారి డిమాండ్లను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగనవాడిలపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని వారన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడిల డిమాండ్లను పరిష్కరించాలని వారు అన్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి లో వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి సందర్భంగా రంగ చిత్ర పటానికి, విగ్రహాలకు పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగాను హతమార్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని అందుకే టిడిపిని దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని ఆయన అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఎన్నోసార్లు టిడిపి ప్రభుత్వం రంగాను చంపిందని చంద్ర బాబే చంపాడన్నారు. చంద్రబాబు నన్ను కూడా చంపాలని చూసాడు కాని నన్ను చంపలేకపోయాడని నారాయణ అప్పట్లో అన్నారు. పదవే శాశ్వతమా, పదవి కోసం పాకులాడాలా, పదవి కోసం పాకులాడే వారిని ఈ సమాజం క్షమించకూడదని కన్నాని ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజశేఖర్ రెడ్డి వెంబడి నడిచాను ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంబడే నడిచాను అని అన్నారు. ఆరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఎవరైనా ఊహించారా. జగన్ ను జైల్లో పెడతానన్నారు అలాగే నన్ను కూడా జైల్లో పెడతారు అన్నారు. సిబిఐ కూడా నన్ను పిలిచింది అయినా నేను నమ్ముకున్న మనిషి కోసం సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్నాను.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎండీఓ కార్యాలయం వద్ద చెవిలో పువ్వులు పెట్టుకుని అంగన్వాడీలు వినూత్న నిరసన చేపట్టారు. 10వ రోజు నిరసనలో భాగంగా చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. జనసేన మైలవరం ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు నిరసనలో పాల్గొని అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికారం కోసం ఉచిత హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత హామీలను తుంగలో తొక్కేసాడు. రాష్ట్రం మొత్తం అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చెవిలో పూలు పెట్టి వాళ్లకు జీతాలు పెంచుతానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీ చేతగాని పరిపాలన వల్ల రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల అంగన్వాడీలు రోడ్డెక్కి వాళ్ళని దీనస్థితికి తీసుకువచ్చారు. ఎవరైతే నీకు ఓటు వేసి గెలిపించారో వాళ్లే రేపు తిరిగి నిన్ను ఇంటికి పంపుతారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చకపోతే తగు బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉమ్మడి ప్రభుత్వం రాగానే అంగన్వాడీలకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
–
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా దళితులపై జరుగుతున్న దాడులను నిరశిస్తూ ముమ్మిడివరం కాశివారితూముసెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద టిడిపి నిరశన దళితులు ఓట్లతో అధికారంలోకి వచ్చి దళితులు పథకాలు ఎత్తివేయడమే గాక,దాడులకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం అమలాపురం పార్లమెంటు టిడిపి ఇన్చార్జి గంటి హరీష్ మాదుర్ తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి దళిత నాయకులు, కార్యకర్తలు.