ట్రాక్టర్ లీజు (Tractor Lease) :
అమాయక రైతులను మోసం చేసి 57 ట్రాక్టర్లను లీజు (Tractor Lease) పేరుతో తీసుకెళ్లి అమ్మేసుకున్న మోసగాళ్లు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని తాడిమర్రి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితులు రవికుమార్ భయ్యా రెడ్డి, హాజీపేరా అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, ధర్మవరం డిఎస్పి శ్రీనివాసులు ఈ రోజు తాడిమర్రి పోలీస్ స్టేషన్ వద్ద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
ఇది చదవండి : వైసిపి పై బురద జల్లాలని చూస్తున్నారు – కావటి
దేవర రామ్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ…
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి గ్రామానికి చెందిన దేవర రామ్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేయగా నిందితులు రైతుల వద్ద నెలకు 25 వేల రూపాయలు బాడుగ ఇస్తామని చెప్పి ట్రాక్టర్లను తీసుకొని వేరే వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది అన్నారు.
పులివెందులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ట్రాక్టర్లను విక్రయించిన విషయం తెలుసుకొని తాడిమర్రి పోలీసులు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని తాడిమర్రి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్ల విలువ నాలుగు కోట్ల 56 లక్షల రూపాయలని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మిగతా నిందితులను సైతం త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపాడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ.
ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే సరికొత్త ‘పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. జనాభా నియంత్రణ, సంతానోత్పత్తి తగ్గుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు.… - పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.
కడప జిల్లా పులివెందులలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు గత వైసీపీ ప్రభుత్వంలో భూకబ్జాలు, నిధుల మళ్లింపు, అవినీతి జరిగాయని ఆరోపించారు.… - అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పేదలు, బీడీ కార్మికులకు 32 సంవత్సరాల క్రితం మంజూరైన ఇళ్ల స్థలాలను తమ కుటుంబం నిరంతరం కాపాడుతూ వస్తోందని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఈ స్థలాలు రద్దయ్యే…









Total views : 141208