అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitaramaraju District) డుంబ్రిగూడ మండలం బొడ్లమామిడి కొల్లాపుట్ పంచాయతీ కి చెందిన పొట్టంగి మధు వైఫ్ ఆఫ్ సన్యాసమ్మ నిండు గర్భిణీ పురిటి రావడంతో హాస్పిటల్ కి తీసుకు వెళ్లడానికి 108 అంబులెన్స్ కి ఫోన్ చేయగా మీ ఊరి వరకు రోడ్డు బాగోలేదు రోడ్డు బాగున్నంతవరకే మేము రాగలమని సిబ్బంది చెప్పడంతో రెండు కిలోమీటర్ల వరకు డోలిమోత తో మోసుకొని రావడం జరిగింది. మరమ్మత్తులో ఉన్న రోడ్డు బాగు చేయకపోవడం వల్లే ఈ సంఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు భావిస్తున్నారు. కావున ఇప్పటికైనా ఐటీడీఏ పీవో వి. అభిషేక్ స్పందించి రోడ్డు పనులు ముమ్మరం చేసి మా సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.ఎన్నికల కమిషన్ నిర్ణయాలు పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రక్రియలో సమిష్టి నిర్ణయాలు, ఓటర్ల జాబితాల విషయంలో పూర్తి పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌లో అంతర్గత అభిప్రాయ భేదాలపై ఇటీవల వచ్చిన నివేదికల…
- బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం లబ్ధిదారులు రోడ్డెక్కారు. ఇండియన్ గ్యాస్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు గ్యాస్ బుక్ చేసుకున్నా.. బుకింగ్‌ను రద్దు…
- అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం పదున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే…