పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజుకు కనీసం రెండు పండ్లు తినడం చాలా మంచిది. కూరగాయల్లో కూడా విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజుకు కనీసం ఐదు కూరగాయలు తినడం చాలా మంచిది. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి రక్తపోటును తగ్గించడంలో, గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వారానికి రెండు సార్లు చేపలు తినడం చాలా మంచిది. తృణధాన్యాల్లో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. పీచుపదార్థం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గించడంలో సహాయపడతాయి. రోజుకు కనీసం ఐదు గ్రాముల పీచుపదార్థాన్ని తీసుకోవడం చాలా మంచిది. నట్స్ మరియు విత్తనాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజుకు ఒక చేతి నిండు నట్స్ లేదా విత్తనాలను తినడం చాలా మంచిది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ఆహారపదార్ధాలను రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. అలాగే, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం కూడా చాలా ముఖ్యం. ధూమపానం, మద్యపానం మానుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటం వంటివి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి.
Antioxidants
గింజపప్పులను (నట్స్) తరచుగా తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. బాదం, జీడిపప్పు, పిస్తా, అక్రోటు (వాల్నట్), వేరుశనగపప్పుల్లోని అసంతృప్తకొవ్వులు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. చేపలతో లభించే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా వీటిల్లో ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉండదు. గింజపప్పులు ఎంత ఆరోగ్యకరమైనవైనా మితంగానే తినాలి. రోజుకి ఆరేడు కన్నా (వారానికి 30 గ్రాములు) మించకుండా చూసుకోవాలి. అప్పుడే వీటితో కలిగే ప్రయోజనాలు అందుతాయి.
Read Also..
Read Also..
నగరంలో దొరికే కివీ పండల్తో ప్రయోజనాలోన్నో. దీని తొక్కను తీసి పారేస్తుంటాం. కానీ అందులో చాలా విషయం ఉంది. తొక్కు వెనుక యాంటీ ఆక్సిడెంట్లు పూర్తి పీచు పదార్ధంతో నిండిన గుజ్జు ఉంటుంది. మొక్కజొన్నను మినహా యిస్తే.. కంటి చూపును కాపాడే లుటియిన్ పదార్థ్ధం ఏ ఇతర పండు, కూరగాయాల్లో కూడా ఇందులో ఉన్నంత ఉండదు. రోజుకు రెండు నుంచి మూడు కివీలు తిన్నవారిలో కంటిసంబంధిత , వయసు పెరుగుదలతో వచ్చే మాక్యులార్ క్షీణత 36% వరకూ తగ్గుతుందని శరీరం లోపల రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గినట్లు నార్వేలో గుర్తించారు. మరో అధ్యయనములో కివి పండు నుంచి తీసిన రసము చర్మ క్యాన్సర్ ను నిరోధిస్తుందని తేలింది.
Read Also..
భోజనానంతరం సోంపు గింజలు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. అవిదుర్వాసనలను దూరం చేయడమే కాదు.. చాలాసేపటికి వరకూ నోటిని తాజాగా ఉంచుతాయి. ఆరోగ్యానికీ సోంపు గింజలు చాలా మంచివి. వీటి నుంచి శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. భోజనం తరవాతే కాదు.. ముందూ తీసుకోవచ్చు. సోంపులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొవ్వు పెంచే కార్బోహైడ్రేట్లను ఇవి దూరం చేస్తాయి. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోకుండా చూస్తాయి. వీటిలో ఉండే పీచు జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీవక్రియల రేటు సక్రమంగా ఉండేలా చూస్తుంది. పీచు వల్ల గుండెకు కూడా మేలే. ఎలాగంటే… పీచు పదార్థాలతో రక్తంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. సోంపును తరచూ తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ బలపడుతుంది. అలానే చెడు కొవ్వును సోంపులోని పోషకాలు గ్రహిస్తాయి. వీటిల్లోని కాపర్ ఎర్రరక్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. జింక్ శారీరక ఎదుగుదలకూ, అవయవాలు దృఢంగా ఉండటానికీ తోడ్పడుతుంది. రక్తపోటుతో బాధపడే వారు సోంపు గింజల్ని రోజులో ఒకటి రెండుసార్లు నమిలితే మంచిది. అలా చేయడం వల్ల పొటాషియం శరీరానికి అంది, రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం మెదడులోని నరాలను ఉత్తేజితం చేస్తుంది. కప్పు సోంపులో ఇరవై శాతం పైనే విటమిన్ ‘సి’ ఉంటుంది. అది రోగనిరోధక శక్తిని పెంచడానికీ, చర్మ కణజాలం దృఢపడి గాయాలైనప్పుడు త్వరగా మానిపోవడానికి దోహదం చేస్తుంది. సోంపు గింజల్లోని ఫ్లవనాయిడ్లు ఒత్తిడిని దూరం చేస్తాయి.




Total views : 140969