హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెలమండిలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆడుకుంటున్న చిన్నారిని ఓ దుండగుడు ఆటోలో ఎక్కించుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. చిన్నారి కిడ్నాప్‌తో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్‌లోని బేగంబజార్ ఛత్రి ప్రాంతంలో ప్రియాంక అనే మహిళ తన సోదరుడితో కలిసి నివసిస్తోంది. అయితే శనివారం సాయంత్రం తన సోదరుడి కుమార్తె ప్రగతితో కలిసి కట్టెలమండిలోని తల్లి ఇంటికి వచ్చింది. ప్రియాంక సోదరి కుమారుడు హృతిక్‌తో ఆడుకునేందుకు బాలిక ఇంటి సమీపంలోని ముత్యాలమ్మ తల్లి గుడికి వెళ్లింది. కాసేపటి తర్వాత హృతిక్ ఒక్కడే ఇంటికి వచ్చాడు. కాని చిన్నారి ప్రగతి ఇంటికి రాకపోవడంతో ప్రగతి కంగారుపడింది. బయటకు వెళ్లి చిన్నారి అత్త ప్రియాంక చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఘటనా ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆడుకుంటున్న చిన్నారిని ఓ అపరిచిత వ్యక్తి ఆటోలో ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో 5 బృందాలుగా ఏర్పడి అబిడ్స్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. చిన్నారి ప్రగతిని నిందితులు ఏం చేస్తారోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కిడ్నాప్ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభం.మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
- ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హర్మూజ్ జలసంధిని తిరిగి…
- ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
- చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.ఈ మ్యాచ్ 20వ ఓవర్లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
- పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 140751