‘రత్నం’(Ratnam Movie) కచ్చితంగా పైసా వసూల్ సినిమా అవుతుంది- మీడియా సమావేశంలో హీరో విశాల్
విశాల్(Vishal), ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ చిత్రాన్ని(Ratnam Movie) నిర్మించారు. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 26న రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో విశాల్ పాల్గొన్నారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
విశాల్(Vishal) మాట్లాడుతూ..
‘19 ఏళ్ల నా కెరీర్లో మీడియా, ఫ్యాన్స్, అభిమానులు, ప్రేక్షక దేవుళ్లందరూ నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. నరసింహారెడ్డి కాలేజ్‌కు సారీ. అక్కడ ఈవెంట్ పెట్టలేకపోయాం. సక్సెస్ మీట్‌ను అక్కడే నిర్వహిస్తాం. మా డాక్టర్ ఏది చేయొద్దంటే అదే చేస్తుంటాను. వాడు వీడు టైంలో మెల్లకన్ను పెట్టి నటించొద్దని అన్నారు.. కానీ నేను వినలేదు. నా శరీరంలో ఇప్పుడు వంద కుట్లున్నాయి. మా డాక్టర్ అలా చెప్పి చెప్పి విసిగిపోయారు.. నేను ఆయన మాట వినకుండా ఫీట్స్ చేస్తూనే ఉన్నాను. నన్ను నమ్మి డబ్బులు పెట్టేందుకు వచ్చిన నిర్మాత బాగుండాలని ప్రయత్నిస్తున్నాను. హరి గారితో భరణి, పూజ చేశాను. అవి పెద్ద హిట్లు అయ్యాయి. విశాల్ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతోంది. సతీష్ గారు ఈ సినిమాను తీసుకున్నందుకు థాంక్స్. అందరికీ ఈ చిత్రంతో లాభాలు రావాలి. ఏప్రిల్ 26న మా మూవీ రాబోతోంది. నేను చివరి నిమిషం వరకు సినిమాను ప్రమోట్ చేస్తాను. అది నా బాధ్యత. మీడియా వల్ల ఈ చిత్రం ఇంత వరకు వచ్చింది. దేవీ శ్రీ ప్రసాద్ మంచి సంగీతం, ఆర్ఆర్ ఇచ్చారు. డైలాగ్ రైటర్ రాజేష్ వల్ల ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమాలా అనిపిస్తుంది. మాతో కలిసిన ఆదిత్య మ్యూజిక్కు థాంక్స్. మా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. హరి గారి చిత్రంలో హీరో కంటే హీరోయిన్ పాత్రలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రియా భవానీ శంకర్ కారెక్టర్ ఈ సినిమాకు ప్రాణం. మీరు పెట్టే డబ్బులకు సరిపడా వినోదం ఇస్తాం. కచ్చితంగా పైసా వసూల్ సినిమా అవుతుంది. నేను ఓటు వేశాను. అందరూ ఓటు వేయాలి. కొత్త ఓటర్లు కచ్చితంగా వెళ్లి పోలింగ్‌లో పాల్గొనండి’ అని అన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
డిస్ట్రిబ్యూటర్ సతీష్ మాట్లాడుతూ..
‘విశాల్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అందుకే రత్నం చిత్రాన్ని తీసుకున్నాను. హరి గారి చిత్రాలంటే అలా పరిగెడుతూనే ఉంటాయి. ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఏప్రిల్ 26న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన విశాల్ గారికి థాంక్స్’ అని అన్నారు.
- హైడ్రాపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి.తెలంగాణ రాష్ట్రంలో చెరువుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో వార్తల్లో నిలిచిన హైడ్రా చర్యలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ను ధిక్కరిస్తూ హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం…
- ఒడిశా పూరి రథయాత్రలో సీఎం చంద్రబాబు.ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోనే కాదు, ఆధ్యాత్మిక రంగంలోనూ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.. ఒడిశాలోని పూరి జగన్నాథుని మహా రథయాత్రకు ఆయన హాజరుకావడం రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారతీయ సంస్కృతి విలువలను కాపాడడంలో…
- పవన్‌కల్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్ నజీర్.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. ఇటీవల ముంబైలో పవన్ కుడి భుజానికి శస్త్ర చికిత్స చేసుకుని… తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శస్త్ర చికిత్స అనంతరం పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి… గవర్నర్…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ‘రత్నం’ ఫుల్ పైసా వసూల్ సినిమా- హీరో విశాల్





Total views : 212402