మహర్షి మూవీలో కథానాయకుడిలా మెదక్ జిల్లా కలెక్టర్ పొలంలోకి దిగి వరి నాట్లు వేశారు. రైతే దేశానికి వెన్నుముక అని తెలిసిన కలెక్టర్ రాహుల్ రాజ్ రైతులతో మమేకమై పొలం పనులు చేశారు. కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కు ఆనుకుని ఔరంగాబాద్ గొల్ల నారాయణ రైతు పొలం ఉంది. వారాంతంలో తమ పిల్లలను తీసుకుని రైతులతో కలిసి రాహుల్ రాజ్ దంపతులు ఆ పొలంలో వరి నాట్లువేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడారు. జిల్లాలో సుమారు 70వేల రైతులు ఉన్నారు. అందులో నాలుగు వందల నలభైఏడుకోట్ల రైతు రుణమాఫీ నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. రైతులకు ప్రతి దశలో అవసరమైన సలహాలు, సూచనలు అందజేసి.. లాభదాయక సాగు చేసే దిశగా అధికారులు పని చేయాలని ఆదేశించారు. వరి నాట్లు వేస్తున్న రైతుల పొలాలను కలెక్టర్ పరిశీలించారు. పంటకు సంబంధించిన అంశాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి… ఇది సాధారణ గ్రామం కాదు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి వనవాసం చేసిన పవిత్ర భూమిగా భక్తులు విశ్వసించే ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ కొలువుదీరిన సీతా…
- అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం..అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం.. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక ఇస్లామిక్ సెంటర్ దగ్గర ఇద్దరు టీనేజర్లు జరిపిన కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు సహా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనను విద్వేషపూరిత దాడి కోణంలో పోలీసులు…
- నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు..నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు ఏ రాజకీయ పార్టీకైనా అధిష్టానమే సుపీరియర్ .కానీ ఆ జిల్లా టిడిపిలో మాత్రం వేరే లెక్క . సిట్యుయేషన్ కి తగ్గట్టుగా ఎదుటివారి బలహీనతలను క్యాష్ చేసుకుంటూ వ్యూహరచన చేస్తూ… అధిష్టానానికి సుపిరియర్ అన్నట్లగా…
- ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం..ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం జరిగింది. రిషికేశ్‌లో ఉజ్జయినీ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో మూడు బోగీలు ధ్వంసమయ్యాయి. ఐతే ప్రమాదం సమయంలో రైల్లో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. యోగ్నగరి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. షంటింగ్ చేస్తుండగా..…
- హైదరాబాద్‌లో మరో భారీగా అవినీతి తిమింగలం..హైదరాబాద్‌లో మరో భారీగా అవినీతి తిమింగలం భాగ్యనగరంలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసమే లక్ష్యంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు తెల్లవారుజాము…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 80640