హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. న్యూయార్క్, టోక్యో తరహాలో ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా జరుపుతున్న ప్రజా పాలన విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లో ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన వేదిక మీదుగా నగరంలోని పలు సుందరీకరణ పనులకు వర్చ్యువల్ గా శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ రైజింగ్ వేడుకలను ప్రారంభించిన సీఎం.. మున్సిపల్ శాఖ ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ను పరిశీలించారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు రూ.7వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. ఎస్టీపీలు, ఫ్లైఓవర్లు, నాలాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వెనెజువెలా డ్రగ్స్ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్.మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉక్కుపాదం మోపింది. వెనెజువెలాకు చెందిన కరుడుగట్టిన డ్రగ్స్ గ్యాంగ్ ట్రెన్ డి ఆరాగ్వాపై చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఆ ముఠా కీలక నేత హెక్టర్ రస్తెన్‌ఫోర్డ్ గురెరో ఫ్లోర్స్ హతమైనట్లు అమెరికా…
- కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.కాకినాడ జిల్లాలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో తమ కుమార్తెను యువకుడు ఉరివేసి హత్య చేశాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందంటూ ఆందోళన…
- ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బత్తుల సుబ్బారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాలకు చెందిన నాలుగు గిరిజన కుటుంబాలను పనుల నిమిత్తం గ్రామానికి రప్పించిన…
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
- అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్.అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రత్యేక జాబితాలో భారత సంతతికి చెందిన ప్రముఖులు సత్తా చాటారు. అమెరికాలో నివసిస్తున్న విజయవంతమైన 250 మంది వలసదారుల జాబితాలో ఏకంగా 27 మంది భారతీయ మూలాల వ్యక్తులు చోటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 141344