గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 8వ తేదీ వరకు యథాతథస్థితిని కొనసాగించాలని తెలిపింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను ప్రభుత్వం ప్రతిపాదించగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతకం చేశారు. వారు ప్రమాణం చేయాల్సి ఉంది.అయితే వీరి నియామకాలను బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. గత ఎమ్మెల్సీ అంశం తేలే వరకు వారి ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించగా నిబంధనల ప్రకారం లేదని గవర్నర్ తిరస్కరించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదించగా గవర్నర్ ఓకే చేశారు. అయితే తమను తిరస్కరించడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు.
Oath taking
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈమేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కీలక భేటీ తర్వాత ఈ నిర్ణయం ప్రకటించారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీని ఎంపిక చేయడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఓవైసీ ప్రొటెం స్పీకర్ గా ఉంటే ప్రమాణ స్వీకారం చేయబోమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయడం, ఒవైసీ ప్రమాణం కూడా చేయడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతకుముందు పార్టీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది శనివారం ఉదయం కిషన్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత అందరూ కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ ఆఫీసులో వారంతా సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు, ప్రమాణ స్వీకారం, ప్రొటెం స్పీకర్ గా ఒవైసీ ఎంపిక అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ శాసన సభాపక్ష నేతను ఎన్నుకోవడంపైనా చర్చించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ రేసులో రాజాసింగ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణరెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Read Also..
Read Also..
తెలంగాణ మూడో శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళసై ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో ప్రమాణం చేయించారు. అల్లా సాక్షిగా అక్బరుద్దీన్ తన బాధ్యతలు నిర్వహిస్తానంటూ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. మంత్రులు డి.శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్టికల్ 178 ప్రకారం శాసనసభ కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకూ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ సేవలందిస్తారంటూ గవర్నర్ ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. అసెంబ్లీలో అందరికంటే సీనియర్ సభ్యుడు కావడంతో అక్బరుద్దీన్‌కు ప్రొటెం స్పీకర్ బాధ్యతలు దక్కాయి. నేడు జరగనున్న శాసనసభ తొలి సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి బయలుదేరేముందు రేవంత్ రెడ్డి పెద్దమ్మతల్లి దర్శనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నాక అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియం వెళతారు. మార్గమధ్యంలో గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. మరోవైపు, గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బస్సుల్లో నేరుగా ఎల్బీ స్టేడియానికి తరలిస్తున్నారు. నాలుగు బస్సుల్లో ఎమ్మెల్యేలు ఎల్బీ స్టేడియానికి బయలుదేరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భారీ భద్రత కల్పించారు.
తెలంగాణలో మరికాసేపట్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పదకొండు మంది సీనియర్ నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈమేరకు మంత్రుల జాబితా ఇప్పటికే రాజ్ భవన్ కు పంపించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మంత్రి పదవికి ఎంపిక చేసిన నేతలకు కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్ రావు ఠాక్రే ఫోన్ చేసి అభినందించనట్లు సమాచారం.
Read Also..
Read Also..





Total views : 141434