మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలో పట్టణ నడిబొడ్డున ఉన్న గాంధీ ట్రస్ట్ భూములతో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ భూములు కూడా అన్యాక్రాంతం అవుతుండడంతో గత కొద్ది సంవత్సరాలుగా పట్టణానికి చెందిన పలువురు నాయకులు, సామాజికవేత్తలు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు నేడు లోకాయుక్త అధికారుల బృందం భూములను పరిశీలించి విచారణ చేపట్టింది. అందుకు సంబంధించిన రికార్డులను అధికారులను అడిగి పరిశీలించారు. కాగా కొన్నేళ్లుగా కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయని దీంతో సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పెడచేవిన పెట్టారని లోకాయుక్త అధికారులకు స్థానికులు తెలిపారు. భూముల అన్యాక్రాంతంపై కేసు నమోదు చేయడం జరిగిందని అందులో భాగంగా పట్టణంలో గాంధీ ట్రస్ట్ మరియు వెంకటేశ్వర స్వామి ఆలయ భూములను పరిశీలించామని దీనిపై మరింత సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని డీఎస్పీ విద్యాసాగర్ తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- విమానంలో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎక్కడికెళ్లినా తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయన విమానంలో క్రికెట్ ఆడి అందరినీ అశ్చర్య పరిచారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓ ప్రైవేట్ విమానంలో ప్రయాణించిన సచిన్… అందులోనే సరదాగా టెన్నిస్ బాల్ క్రికెట్…
- ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్లో బలమైన ఆరంభం.ఇంగ్లాండ్ మహిళల జట్టు, శ్రీలంక మహిళలపై జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుతమైన ఆధిపత్యాన్ని చూపుతూ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, 20 ఓవర్లలో కేవలం 1 వికెట్…
- దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.తాజాగా తుగ్లకాబాద్‌లోని ఓ భవనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.…
- భారత ఘాటింగ్ కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత.దిగ్గజ షూటర్, ప్రఖ్యాత కోచ్ జస్పాల్ రాణా కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన.. తుదిశ్వాస విడిచారు. భారత్ స్టార్ షూటర్ మను బాకర్ ఈయన కోచింగ్‌లోనే రాటుదేలిన సంగతి విదితమే. ISSF వరల్డ్ కప్‌లో భాగంగా…
- పశ్చిమబెంగాల్: ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం..పశ్చిమబెంగాల్లో ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో సుమారు 4 వేలకు పైగా ఈవీఎంలు దహనం అయ్యాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో వినియోగించిన ఈవీఎంలను కోల్‌కతా అలీపూర్‌లోని ప్రభుత్వ భవనంలో అధికారులు భద్రపరిచారు. ఈవీఎంల దహనంపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 141206