చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో రోడ్ షో లో మాట్లాడుతున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. అత్యంత అవినీతి పరుడు కెసిఆర్ అని, కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించుదామా వద్దా, కుటుంబ పాలన ను అంతం చేద్దామా వద్దా, వేల కోట్ల అవినీతి చేసిన కెసిఆర్, కేటీఆర్ లను జైల్ కి పంపుధమా వద్దా, కాంగ్రెస్ కి ఓటేస్తే ఆ ఓటు కెసిఆర్ కి పోతది ఎందుకంటే ఎన్నికల గెలిచిన తరవాత కాంగ్రెస్ ఎమ్మెల్యే లు brs పార్టీ లో కలుస్తారు. అయోధ్య మందిరం జనవరీ 22 కి ప్రారంభిస్తారు. తెలంగాణ లో బిజెపి ప్రభుత్వం వస్తె అయోధ్య మందిరం తీసుకెళ్లే బాధ్యత బిజెపి ప్రభుత్వం ది అని అమిత్ షా చెప్పారు. వచ్చిన అభిమానులు మొత్తం మోడీ , జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు
ts politics
తెలంగాణ ప్రజల ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, అందుకే రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్రమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఆయన హైదరాబాద్ సోమాజీగూడలో మీడియాతో మాట్లాడారు. 1200 మంది యువత బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని, కాని నేడు రాష్ట్రంలో యువత, రైతులు నైరాశ్యంలో ఉన్నారని అన్నారు. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ నెరవేర్చలేదన్నారు. తెలంగాణలో భూముల వేలంలో రూ.4 వేల కోట్ల అవినీతి జరిగిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. ఔటర్ రింగ్‌రోడ్డు లీజు వేలంలో, కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ సహకరించకపోయినా మోదీ తెలంగాణ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు. 2.5 లక్షల ఇళ్లు తెలంగాణలో కట్టామన్నారు. బుజ్జగింపు రాజకీయాలతో కేసీఆర్ తెలంగాణ ప్రతిష్టను దిగజార్చరని ఆయన విమర్శించారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నియోజకవర్గం నుండి రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. రవాణా మంత్రి పదవి చేపట్టి ఖమ్మం రాజకీయాలలో తన దైన ముద్రను వేసారు. ఖమ్మం కు నిధుల వరద పారించారు. తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుంది అంటూ మూడోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. ఇందంతా నాణానికి ఒక వైపు మాత్రమే మరోవైపు ఖమ్మం లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాజకీయ నిరంకుషత్వానికి బ్రాండ్ అంబాజిడర్ గా మారారు. తొండ ముదిరి ఊసరవెళ్ళి అయినట్టు ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం సోషలిస్ట్ గా కనబడిన పువ్వాడ మంత్రి పదవి చేపట్టగానే జిల్లా లో తన మాటే శాసనంగా ఫ్యూడల్ రూపమెత్తారు. తనకు వ్యతిరేఖంగా ఎవ్వరు ప్రవర్తించినా అక్రమ కేసులు, నిర్భందాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కారు. అక్రమ కేసులతో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన ఘటనలో ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. మంత్రి పువ్వాడ అప్పటి అధికార అండతో ప్రతిపక్షాల గొంతునొక్కినా ప్రస్తుత ఎన్నికల్లో అవే గొంతులు ఖమ్మం లో పువ్వాడపై నిరసన గళాన్ని వినిపిస్తున్నాయి.
తుమ్మల రాకతో సీన్ రివర్స్ ….
ప్రతిపక్షాలను ఎన్ని నిర్భందాలకు గురిచేసినా మంత్రి అనుచరులు తమ అవినీతి తో గుట్టలను గుటకాయ స్వాహా చేసినా తాను ఖమ్మంకు చేసిన అభివృద్ధే తనను మరోసారి గెలిపిస్తుందని నిన్న మొన్నటి వరకు అజయ్ ధీమా గానే ఉన్నారు . రాజకీయంగా బీఆర్ఎస్లో గత ఎన్నికల్లో తాను చెక్ పెట్టి పడగొట్టిన తుమ్మల కాంగ్రెస్ పార్టీలొ చేరడం ఖమ్మంలో తన పైనే పోటీకి దిగడంతో సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. తుమ్మల రాజాకీయ చతురత ముందు పువ్వాడ ప్రచారంలోనే తేలిపోతున్నారు. ఖమ్మంలో అంతా తానై ప్రవర్తంచిన మంత్రి పువ్వాడను సొంత పార్టీ నేతలే అదును చూసి హ్యండిచ్చి ఒక్కొక్కరిగా హస్తం గూటికి చేరుతున్నారు. దీంతో తన గెలుపు నల్లేరుపై నడకే అనుకున్న పువ్వాడ క్షేత్ర స్థాయిలో నెల రోజుల వ్యవధిలోనే సీన్ రివర్స్ కావడంతో ప్రచార పర్వంలో ఆపసోపాలు పడుతున్నారు. ప్రత్యర్థి తుమ్మల పై ఏ అవినీతి ఆరోపనలు లేకుండా తెల్ల కాగితంలా ఉండడంతో మంత్రి పువ్వాడ అజయ్‌కు ఏంచెయ్యాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలోనే స్థానికతను తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేసినా ఆ అస్త్రం తుమ్మల పై పనిచేయడం లేదు. దీంతో ప్రత్యర్థిని ఎలా విమర్శించాలో తెలియని విపత్కర పరిస్థితి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ది.
తుమ్మల రాజాకీయ పద్మవ్యూహంలో చిక్కుకున్న అజయ్ ….
తనను ఖమ్మం అభ్యర్థిగా ప్రకటించిన అనతి కాలంలోనే తుమ్మల అజయ్ ను అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టేందుకు అస్త్ర శస్త్రాలు సిద్దం చేసుకున్నారు. అక్రమ కేసులే ఆయుదంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అక్రమ కేసులు నిర్భందాలు లేని ప్రశాంతమైన ఖమ్మం కావాలంటే తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఖమ్మంలో గెలుపును ప్రభావితం చేసే కమ్మ సామాజిక వర్గం తుమ్మలకు జై కొడుతుంది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఎంపీ వద్ది రాజు పట్ల గతంలో పువ్వాడ వైఖరిని ఊటంకిస్తూ కాపు సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నంలో తుమ్మల సఫలీకృతం అయ్యారు. ఖమ్మంలో బలంగా ఉన్న టీడీపీ క్యాడర్ తుమ్మల వెంటే ఉండడంతో గత రెండు దఫాలుగా నామామాత్రం మెజారిటీతో బయటపడ్డ పువ్వాడ ఈ సారి ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమే అని రాజవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పువ్వాడకు పెట్టని కోటగా ఉన్న రఘునాథపాలెం సైతం తుమ్మల రాకతో బీటలు వారాయి. పువ్వాడను ఒక్కొక్కరిగా కార్పోరేటర్లు వీడుతున్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు వలసలు పెరుగుతున్నాయి. నియోజకవర్గంలో బలంగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్ , మద్దత్తుగా నిలిచిన టీడీపీ శ్రేణులు, పొంగులేటి అనుచరులు, పొత్తుల్లో చేయి కలిపిన సీపీఐ తుమ్మలకు మరింత బలాన్ని చేకూర్చాయి. రోజురోజుకు బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడంతో పువ్వాడ డిఫెన్స్‌లో పడ్డారు. తాను ఓడిపోయినా బీఆర్ఎస్ అదికారంలో వస్తుందని ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి పదవి చేపట్టి తాను ఓటమికి కారణం అయిన వారి సంగతి చూస్తానని పార్టీ వీడిన నేతలపై తన అనుచరుల వద్ద మంత్రి పువ్వాడ ఆక్రోశాన్ని వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు (శనివారం) వేములవాడ దద్దరిల్లనుంది. BJP అభ్యర్థి చెన్నమనేని వికాస్‌రావుకు మద్దతుగా 11AMకు సకల జనుల విజయ సంకల్ప సభ నిర్వహించనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రానున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కు మద్దతుగా 2PMకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగ సభ జరగనుంది. మరుసటి రోజు (26న) BRS అభ్యర్థి చల్మెడకు మద్దతుగా KCR ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది.
అలంపూర్ తాలూకా బీఆర్ఎస్ పార్టీని నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే అబ్రహం. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి ఆలయాన్ని ఎమ్మెల్యే అబ్రహం దర్శించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అబ్రహం మీడియాతో మాట్లాడుతూ జరుగుతున్న ఎన్నికలు ఆధిపత్యం, ఆత్మగౌరవం మధ్య ఎన్నికల పోరాటం జరుగుతుంది. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అలంపూర్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించా. సీఎం కేసీఆర్ నా పేరు ప్రకటించిన చివరకు బీఫామ్ ఇవ్వలేదు. నాకు టికెట్ రాకుండా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అడ్డుపడ్డాడు. ఎమ్మెల్యే అబ్రహం కు టికెట్ ఇస్తే చల్లా వెంకట్రామిరెడ్డి రాజీనామా చేస్తానని చెప్పడం జరిగింది. ఎమ్మెల్సీ చల్లా చాలామందికి టికెట్ ఇస్తానని ఆశ చూపి వెంట తిప్పించుకున్నాడు. మాజీ ఎంపీ మందా జగన్నాథం ను కూడా టికెట్ విషయంలో మోసం చేశారు. అల్లంపూర్ అభివృద్ధి చేయాలంటే అన్ని రంగాలపై పరిజ్ఞానం లేని వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. అల్లంపూర్ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలంటే అసెంబ్లీలో కానీ, ఐఏఎస్ ఆఫీసర్లతో మాట్లాడగలిగే అర్హత ఉన్న వ్యక్తి నీ. పుల్లూరు గ్రామంలో చదువుకున్న వ్యక్తి లేరా. ఎస్సీ నియోజకవర్గంలో నీ పెత్తనం ఏంటి. ఈరోజు ఒక్కరోజే కాదు. 2014 సంవత్సరంలో కూడా ఇలానే చేశావు. సంపత్ కుమార్ మరియు నా విషయంలో కూడా ఇలానే చేశావు. ఏమిటి నీ ఆధిపత్యం. దానిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరా. అల్లంపూర్ ప్రజలారా చదువుకున్న వ్యక్తి కాబట్టి అవగాహన కలిగిన వ్యక్తి సంపత్ కుమార్ ను గుర్తించండి. ఎలాంటి పదవులు ఆశించకుండా. స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరి సంపత్ కుమార్ గెలుపుకు కృషి చేస్తాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అన్ని కులాలను సమానంగా చూసా. ఎందుకంటే అలంపూరు లో ప్రశాంత వాతావరణ ని పెంపొందించా..
ఎన్నికల సమయంలో ఎం మాట్లాడాలో, ఎవరి గురించి చెప్పాలో అది చెప్పాలని వచ్చాను. బిఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎవరు సంతోషంగా లేరు. గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి ప్రాజెక్టులు పూర్తయ్యాయా, ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ముల్కనూర్ గ్రామంలో ఏమయిన అభివృద్ధి జరిగిందా, స్థానిక ఎమ్మెల్యే భూ నిర్వాసితుల పక్షాన మాట్లాడడా, 10 సంవత్సరాలు గడుస్తున్న నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాడ, వడ్ల తూకంలో ఎక్కువ తరుగు తీస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఏం చేశాడు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పదువులు ఇచ్చాడు కానీ, ఒక్కరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంలో చాలా అవినీతి జరిగింది. రైతుల రుణమాఫీ చెయ్యలేదు రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక లో కాంగ్రెస్ రైతులకు రుణ మాఫీ చేసింది ఆదాని కి దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ అప్పగిస్తున్నాడు. రైతు ఒక్కరోజులో 70 రూపాయలు సంపాదిస్తుంటే, అధాని మాత్రం 16 వందల
కోట్లు సంపాదిస్తున్నారు. 10 సంవత్సరాలు బిఆర్ఎస్ పాలన చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర అభివృద్ధికి ఒక ప్రణాళిక తో మీ ముందుకు వచ్చింది. ఎంఐఎం తెలంగాణలో పుట్టిన పార్టీ దేశంలో వివిధ రాష్ట్రాల్లో 50, 60 సీట్లలో పోటీ చేస్తుంటే రాష్ట్రంలో 8, 9 సీట్లకు ఎందుకు పోటీ చేస్తుంది. ఓవైసీ ఎప్పుడు రాహుల్ గాంధీ ని నిందిస్తారు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజలను రాహుల్ గాంధీ కలిశారు. బిఆర్ఎస్ బిజెపి ఎంఐఎం కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయి. ఎందుకంటే వల్ల అవినీతి సొమ్మును బయటికి తీసి, ప్రజలకు పంచుతామని, సోనీయామ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమెను మీరు గౌరవిస్తారు. మహాత్మా గాంధీ నుండి ఇప్పటి వరకు మేము ప్రజల కోసం కొట్లాడుతున్నాము. ప్రజల సంపద ప్రజలకే చెందాలని కాంగ్రెస్ చూస్తుంది. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం లోకి రాగానే 6 గ్యారంటీ లు అమలు చేస్తాం. ఛత్తీస్ ఘడ్, కర్ణాటక రాష్ట్రాల్లో చేసి చూపించాం. హుస్నాబాద్ లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం. మీరు ఈ సారి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, కాంగ్రెస్ మీ అభివృద్ధి కోసం పాటుపడుతుంది. మీరు ఈ సారి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, 5 ఎండ్ల తరవాత వచ్చి నేను ఇదే వేదిక పైన ఎం చేశామో గర్వంగా మాట్లాడుతాను. తెలంగాణ కోసం కొట్లాడింది మీరు, రాష్ట్రం మీది, మీకోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు తన అనుచరులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ చేరుకొని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. దీంతో కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాత్రి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఓ కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇస్తే సమాచారాన్ని ఇచ్చిన వారిని కొల్లాపూర్ ఎస్సై, కొల్లాపూర్ మాజీ జెడ్పిటిసి హనుమంతు నాయక్ , ముక్కిడి గుండం మాజీ సర్పంచ్ లోకేష్ యాదవ్ ను అతి దారుణంగా కొట్టారని జూపల్లి ఆరోపించారు. పోలీసులు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి డైరెక్షన్ లో పనిచేస్తున్నారని అన్నారు. పోలీసులు అధికార బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దౌర్జన్యాలకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో రాక్షస పాలన సాగుతోందని రాయలసీమ రౌడీల లాంటి ఎస్ఐలను కొల్లాపూర్ తీసుకొచ్చి పనిచేపిస్తున్నారని విమర్శించారు. తన కార్యకర్తలపై పోలీసులు బూటు కాళ్లతో తన్నారని బెల్టులతో కొట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణంపై సీఎం కేసీఆర్ కు కేటీఆర్ కు కవితకు హరీష్ రావుకు చెప్పిన పట్టించుకోలేదని ఆయన తెలిపారు. దీని కోసమేనా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది అని ప్రశ్నించారు.
లీడర్లను కొనవచ్చు కానీ తమ ప్రజల ఆత్మ గౌరవాన్ని కొనలేరని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి మాట్లాడుతూ… రాహుల్, ప్రియాంకలు కర్ణాటకలో అయిదు హామీలు చెప్పారని అక్కడి ప్రజలు నమ్మి ఓటేశారన్నారు. వారు అధికారంలోకి వచ్చాక ఉన్న కరెంటు పోయిందన్నారు. వారి పరిస్థితి పెనం మీది నుండి పోయిల పడ్డట్టు అయ్యిందన్నారు. వైఎస్ పీరియడ్‌లో ఉచిత కరెంటు అని ఉత్త కరెంటు చేసిండ్రని వ్యాఖ్యలు చేశారు. కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా అంటూ ప్రశ్నించారు. కరెంటు కావాలంటే కారుకు ఓటు వేయండన్నారు. కేసీఆర్ ఇంత మంచిగ చేస్తుండగా కాంగ్రెస్ వాళ్ళను నమ్మడం దేనికి రిస్క్‌ల పడటం దేనికని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేశారని రైతులకు తిరిగి డబ్బులు ఇచ్చింది ఒక్క కేసీఆరే అని చెప్పుకొచ్చారు. తమ పథకాలు కాంగ్రెస్ వాళ్లు నకల్ కొట్టారు కానీ ఆఖల్ లేదన్నారు. కేసీఆర్ ఎకరాకు 16 వేల రూపాయలు ఇస్తా అంటే కాంగ్రెస్ వాళ్లు రైతుకు 15వేల రూపాయలు అంటున్నారన్నారు.
పదవులు, కాంట్రాక్టుల కోసం బీజేపీ పార్టీలో చేరలేదని ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయాలకు వచ్చానన్నారు మునుగోడు బిజెపి పార్టీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి. కానీ కొందరు దాన్ని జీర్ణించుకోలేక తన రాజకీయ ఎదుగుదలకు అడ్డం పడుతున్నారన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ పలు వార్డుల్లో ప్రచారంలో భాగంగా ఈ విధంగా మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అవినీతిలో కూరుకుపోయి రెండుసార్లు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిన అసెంబ్లీలో ఏ ఒక్కరోజు కూడా మునుగోడు సమస్యలపై మాట్లాడలేదన్నారు. బిజెపి మేనిఫెస్టో వివరిస్తూ సంవత్సరానికి నాలుగు సిలిండర్లు ఉచితమని మహిళలకు పావుల వడ్డీకే రుణాలని అమ్మాయి పుట్టగానే 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామన్నారు. కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను కోరారు.
సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ నేతలతో రేవంత్ భేటీ అయ్యారు పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఫైనల్ చర్చలు నిర్వహించారు. . అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పని చేసే విషయంలో ఇరు పార్టీల మధ్య గత కొంత కాలంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐకి కొత్తగూడెం టికెట్‌తో పాటు ఓ ఎమ్మెల్సీ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
మునుగోడులో స్నేహపూర్వక పోటీ చేసేందుకు సీపీఐ ఆలోచన చేసినా అందుకు కాంగ్రెస్ ఒప్పుకోలేదు. దీనికి సీపీఐ నాయకత్వం సైతం సుముఖత తెలపడంతో సీట్ల సర్దుబాటు అంశం దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఈ మేరకు ఇవాళ సీపీఐ నేతలతో రేవంత్ రెడ్డి ఫైనల్ డిస్కషన్స్ చేసి పొత్తుపై అధికారిక ప్రకటన చేశారు.




Total views : 150082