Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Telangana తెలంగాణ DSC పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ DSC పరీక్షల షెడ్యూల్ విడుదల

by Satya
తెలంగాణ DSC పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్షకు పూర్తి షెడ్యూల్‌ విడుదలైంది. జులై 18 నుంచి ఆగస్టు 5వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఆర్‌టీ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. జులై 18న మొదటి షిఫ్ట్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌ పరీక్ష, సెకండ్‌ షిఫ్ట్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పరీక్ష నిర్వహిస్తారు. జులై 19 నుంచి 22 వరకు వివిధ మాధ్యమాల ఎస్జీటీ పరీక్షలు జరుగుతాయి. జులై 20న ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ , జులై 22న స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథ్స్‌, జులై 24న స్కూల్‌ అసిస్టెంట్‌ బయలాజికల్‌ సైన్స్‌, జులై 26న తెలుగు భాషా పండిట్‌, సెకండరీ గ్రేడ్‌టీచర్‌ పరీక్ష, జులై 30న స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ పరీక్ష నిర్వహిస్తారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
    మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో…
  • హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.
    హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
  • అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.
    అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్‌హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
  • అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.
    ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై…
  • వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.
    ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడుతో పాటు మరో మూడు గిరిజన గ్రామాల ప్రజల గుండెల్లో మాత్రం వణుకు మొదలవుతుంది. వారికి వర్షం అంటే పరవశం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

026119
Total views : 149940

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.