కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణ పడితే ప్రజలకు నష్టమని.. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని.. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు పోతామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మూసీ నది అభివృద్ధికి కేంద్రం సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ సమస్యలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. పలు అంశాలపై కేంద్ర సానుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. స్కైవేల నిర్మాణానికి డిఫెన్స్ భూములను ఇచ్చారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించింనందుకు ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Adilabad
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని సాలిగాం గ్రామంలో గోలేటి శంకర్ కుటుంబ సభ్యులను పిస్తోల్ బెదిరించి పారిపోయిన నిందితులను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెల్లంపల్లి రూరల్ సిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఎసిపి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం సాలిగామ గ్రామానికి చెందిన గొలెటి శంకర్ కుమార్తె బేబీకి మాల గురజాల గ్రామానికి చెందిన గోమాస నరేందర్ తో 2016లో వివాహం జరిపించగా, పెళ్లి అయినప్పటి నుండి నరేందర్ తన భార్య అత్తమామలను అదనపు కట్నం అస్తికోసం వేధించేవాడని తెలిపారు.గతంలో ఇదే విషయంలో నరేందర్ ను శాలిగమ గ్రామస్తులు కొట్టగా అట్టి విషయాన్ని మనసులో పెట్టుకున్న నరేందర్ వారిని ఎలాగైనా చంపాలని ఉద్దేశంతో తనతో పని చేస్తున్న బీహార్ కు చెందిన రవీందర్ పెళ్లికి వెళ్లి అక్కడ పిస్టల్ కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ఈనెల 27వ తేదీన రాత్రికి 10 గంటల సమయంలో నరేందర్ పిస్టల్ తో తన మామ ఇంటికి వెళ్లి వారిని ఆస్తి కోసం బెదిరించి ఇంటి ముందు పిస్టల్ తో రెండు రౌండ్ లు కాల్పులు జరిపి తన స్నేహితుడు మహేష్ తో పారిపోయినట్లు పేర్కొన్నారు. నిందితుడు నరేందర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరో నిందితుడు కోడి మహేష్ పరారీలో ఉన్నట్లు త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. నిందితుడు నరేందర్ నుండి 9MM పిస్తోల్ ,6 బుల్లెట్లు, ఒక బైకు, ఒక సెల్ ఫోన్, స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్ర ప్రజల సొమ్ము లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్, కేటీఆర్ లు తప్పు చేశామని ఒప్పుకొని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేటీఆర్ బృందం మేడిగడ్డ సందర్శన ఆశ్చర్యకరమని తెలిపారు. ఒకవైపు కేసీఆర్ కాళేశ్వరం ఎందుకు పోతున్నారని ప్రశ్నిస్తుండగా, కేటీఆర్ మరోవైపు ప్రాజెక్ట్ ను సందర్శిస్తున్నారని, ఈ సందర్శనలో ఆయన తండ్రి కెసిఆర్ ప్రాజెక్ట్ ను ఎంత కష్టపడి నిర్మించి, ప్రజల సొమ్మును ఏ విధంగా దోచుకున్నాడో తెలుస్తుందని ఎద్దేవా చేశాడు. 36వేల కోట్ల రూపాయలతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించాల్సి ఉండగా ప్రాజెక్టు డిజైన్ మార్చి, లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కేసిఆర్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్యాయం చేసిందని ఆరోపించారు. వేల పుస్తకాలు చదివి, ప్రాజెక్టు నిర్మించానన్నా కేసీఆర్ లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. లక్ష కోట్లుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు 940 టీఎంసీల నీటిని పంపింగ్ చేసి,17లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా,ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేవలం 168 టీఎంసీలు నీరు పంపింగ్ చేసి, 90 వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందించిందని, చాలా నీరు వృధా అయ్యిందన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన అప్పుపై వడ్డీ మాత్రమే సుమారు 50 వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం పడిందని వివరించారు. ప్రజల సొమ్మును కమిషన్ల రూపంలో కేసీఆర్ దోచుకున్నాడని ఆరోపించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
తుమ్మడి హెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును గ్రావిటీకి వ్యతిరేకంగా మేడిగడ్డ వద్ద నిర్మించి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో తుగ్లక్ పాలన నిర్వహించాడని విమర్శించారు. ప్రాజెక్టుతో రెండు టీఎంఎస్ నీటిని అందించలేదని,మూడో టిఎంసికి 27 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. మూడో టిఎంసికి అనుమతులే ఇంకా ఇవ్వలేదని ఇటీవల పర్యటించిన కేంద్ర బృందం స్పష్టం చేసిందని తెలిపారు. కాంట్రాక్టర్లను ధనికులను చేసేందుకే గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మించిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సిబిఐ,ఈడీ విచారణ నిర్వహించాలని, ప్రతి చిన్న విషయంలో దాడులు నిర్వహించే ఈడీ ఇంత పెద్ద అవినీతి జరిగిన కాళేశ్వరంపై ఎందుకు దాడులు నిర్వహించలేదని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ దుర్వినియోగంపై సిగ్గుపడాలని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో రైతులు నష్టపోయారని, గత ప్రభుత్వ హయాంలో ఎవరు స్పందించలేదన్నారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం నిర్మించగా, మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తామన్న కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు నీటిని ఇవ్వలేకపోయిందని, ధరణి పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో అనేక రకాల పథకాల పేరుతో ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతిపై కమిటీని ఏర్పాటు చేసి, వారు దోచుకున్న సొమ్మును వారిచే కక్కించేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Gandhari Qilla Maisamma Jatara :
మందమర్రి మండలం బొక్కల గుట్ట లో గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర గత మూడు రోజులుగా ఆదివాసీ నాయక్ పొడ్లు, రోడ్డ వంశస్థులు గిరిజన సంప్రదాయ పద్దతులలో ఘనంగా నిర్వహించారు. జాతర చివరి రోజున చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, క్యాతనపల్లి చైర్ పర్సన్ జంగం కళలు గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లి జాతర లో పాల్గొన్నారు. చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి కాల భైరవుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
జీడికోట లో ఏర్పాటు చేసిన దర్బార్ లో చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి తోపాటుగా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఆదివాసీ నాయక్ పొడు కుల పెద్దలు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ లో ఆదివాసీ నాయక్ పోడ్ లో ఆదివాసీ ల ఆరాధ్య దైవం గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరలో సౌలత్ లు లేకా భక్తులు ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఎమ్మేల్యే స్పందించి
గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర కు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం కింద త్రాగునీరు,విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తాననీ ఆదివాసీలకు హామీ ఇచ్చారు. అలాగే గాంధారి ఖిల్లాను టూరిజం స్పాట్ గా ఏర్పాటు చేసేందుకు సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకేళ్లుతాననీ భరోసానిచ్చారు.
రెబ్బెన మండలంలోని గంగాపూర్ లో నిర్వహించే మూడు రోజుల జాతరకు రెండవ రోజు జాతర సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆలయాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా వచ్చిన జిల్లా కలెక్టర్ బర్కడే హేమంత్ సహదేవరావు కు ఆలయ కమిటీ ఈవో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ జాతరకు కొమరం భీం జిల్లా నే కాకుండా మహారాష్ట్ర ఇతర జిల్లాల నుండి కూడా దర్శనార్థం భక్తులు వస్తూ ఉంటారు.
కొమురం భీం అసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన గంగాపూర్ శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జాతర నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు అంగరంగ వైభవంగా ఈ జాతర మహోత్సవం సాగనుంది. రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ శివారులోని నది ఒడ్డున కొలువైన శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మొదటి రోజు స్వామి వారి కల్యాణం, రెండోరోజు రథోత్సవం, మూడో రోజు భక్తులకు దర్శనం తర్వాత జాతర ముగియనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భక్తులతో పాటు కరీంనగర్, వరంగల్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని జిల్లా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలాజీ వెంకన్న కొలువైన తీరు గంగాపూర్ శివారులోని గుట్టపై ఉన్న శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి కొలువైన తీరు, ఆలయ నిర్మాణానికి సంబంధించిన చారిత్రాత్మక ఆధారాలు ఇలా ఉన్నాయి.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 16వ శతాబ్దానికి ముందు ఇదే గ్రామానికి చెందిన ముమ్మడి పోతాజీ అనే భక్తుడు చిన్నతనం నుంచి భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలుస్తూ ఏటా మాఘశుద్ధ పౌర్ణమి రోజున తిరుమల తిరుపతి వరకు కాలినడకన వెళ్లి మొక్కులు చెల్లించుకునేవాడు. కాలక్రమేనా వయస్సు పైబడం తోపాటు ఆరోగ్యం సహకరించక తిరుపతి వరకు వెళ్లలేకపోవడంతో మనోవేదనకు గురవుతాడు. స్వామి వారే పోతాజీ కలలో కనిపించి గ్రామ పొలిమేరలోని గుట్టలో కొలువై ఉన్నానని, ఆలయం నిర్మించాలని కోరినట్లు స్థానికులు చెప్పుకుంటారు. ఏటా మాఘశుద్ధ పౌర్ణమి పర్వదినాన నీకోసం, నీలాంటి భక్తుల కోసం దర్శనం ఇస్తానని చెప్పినట్లు ప్రచారంలో ఉంది. దీంతో గంగాపూర్ వాగులో పుణ్యస్నానమాచరించి గుట్టను తొలగవ స్వామి పట్టెనామాలు దర్శనమిచ్చినట్లు చెబుతుంటారు. నాటి నుంచి నేటి వరకు ప్రతీ మాఘ శుద్ధ పౌర్ణమి పర్వదినాన స్వామివారు ఆలయంలో కొన్ని గడియలు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తుంటాడని నమ్మకం ఏర్పడింది.
Manchryala District :
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో వరుస దొంగతనాలు (Thefts) కలకలం రేపుతున్నాయి. మేడారం జాతర వేల తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా వరుస దొంగతనాలతో దొంగలు పోలీసులకు సవాలు విసురుతున్నారు. పట్టణంలోని విశ్వకర్మ కాలనీకి చెందిన బ్రహ్మయ్య అనే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి తాలాలు పగలగొట్టి సుమారు తులం బంగారు 40 వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీకి చెందిన ముల్కల వీరారెడ్డి తన పక్కింటి వారితో కలిసి మేడారం జాతరకు వెళ్లగా ఇదే అదునుగా చేసుకుని దొంగలు రెండు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి విలువైన వెండి సామాగ్రి కొంత డబ్బును ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించడంతో వేలిముద్రలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ధ్వంసమైన విగ్రహాలు (Destroyed idols):
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని బోరంపల్లి గ్రామంలో సావిత్రిబాయి జ్యోతిరావు పూలే విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఇది గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని, అనంతరం కేసు నమోదు చేసి కోటపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఉడత బాబుగా గుర్తించారు. అయితే తాగిన మైకంలో విగ్రహాలను ధ్వంసం చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Manchryala District :
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని పారుపెల్లి గ్రామ సమీపంలో గల కాల భైరవ ఆలయంలో నరదోష నివారణ కాల భైరవ హోమం ఘనంగా నిర్వహించారు. అటవీ ప్రాంతంలో స్వయం భూగ వెలసిన ఈ ఆలయంలో ఆరుద్ర నక్షత్ర భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని శృంగేరి శారదాపీట ఆస్థాన ప్రవచనిధి బాచంపెల్లి సంతోష్ శాస్త్రి ఆధ్వర్యంలో హోమ కార్యక్రమం నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. అనంతరం ఆయన భక్తులకు ప్రవచనాలను బోధించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భైరవ నామ స్మరణతో అటవీ ప్రాంతం మారుమోగింది..ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
ఆసియా లొనే అతి పెద్ద జాతర వరంగల్ జిల్లా మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు షెల్టర్ తో పాటు బస్సులను జెండా ఊపి ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామీ…. మంచిర్యాల జిల్లా మందమర్రి బస్టాండ్ నుండి 55 బస్సులను మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం TSRTC ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లో బస్సు షెల్టర్ బస్సులను డిపో మేనేజర్ తో కలిసి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి మేడారం జాతర ప్రత్యేక బస్సులకు రిబ్బన్ కట్ చేసి, జెండా ఊపి ప్రారంభించి, స్వయంగా వారే బస్సులను నడిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి డిపో మేనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ లు పోలీస్ బందోబస్తు మరియు ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ పట్టణ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రయాణికులు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్స్ (Auto Drivers):
ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెకు మద్దతుగా మందమర్రి పట్టణంలోని బస్టాండ్ జాతీయ రహదారి ఆటో డ్రైవర్స్, ఓనర్స్ బంద్ కు పిలుపునిచ్చారు. ఇతర ప్రాంతల నుండి వచ్చే ఆటోలను అడ్డు కొని తిరిగి వెనక్కి పంపిస్తూన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ జీవో నెంబర్ 106 వెంటనే రద్దు చేయాలని కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న జీవోలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రద్దు చేయాలని లేనిపక్షంలో వాహనాల డ్రైవర్ వ్యవస్థ మొత్తం బందు పిలుపునిచ్చి రోడ్డుపైకి వచ్చి ధర్నాలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలిపారు . అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం క్రింద ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చి మొన్న జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆటో డ్రైవర్ల గురించి ప్రస్తావించలేదని ఉచిత ప్రయాణం వలన మహిళలకు నెలకు 6000 మిగులుతున్నాయని చెప్పుతున్నా ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండి లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ కు నెలకు 10000 లు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలిపారు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
- విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.by CVR NEWSఫిఫా వరల్డ్ కప్-2026లో భాగంగా అర్జెంటినా, ఈజిప్ట్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు.హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్‌పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి…
- హైదరాబాద్: నాచారంలో బాలామృతం ప్లాంట్ ప్రారంభం.by CVR NEWSతెలంగాణలో మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని నాచారంలో 20 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన బాలామృతం ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన…
- 105 కేసుల నిందితుడిని అరెస్టు చేసిన సంగారెడ్డి జిల్లా పోలీసులు.by CVR NEWSసంగారెడ్డి జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర దొంగతనాల కేసుల్లో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మొత్తం 105 కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రయ్యను ఎనిమిది నెలలపాటు ప్రత్యేక నిఘా అనంతరం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Total views : 194026