ఇజ్రాయిల్(Israel)లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హెజ్బుల్లా దక్షిణ లెబనాన్ నుంచి దాదాపు 160 రాకెట్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య ఘర్షణ ప్రారంభమైన తర్వాత జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా, తమ కీలక కమాండర్ తలెబ్ సమీ అబ్దుల్లా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌కు చెందిన రెండు మిలిటరీ బేస్‌లపై రాకెట్లు, మిస్సైళ్లతో దాడి చేశామని హెజ్బుల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికాతో సహా అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న వేళ హెజ్బుల్లా ఈ దాడికి పాల్పడటంతో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. ఇప్పటివరకు లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 400 మంది హెజ్బుల్లా సభ్యులు మరణించారని అధికార వర్గాలు తెలిపాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
- అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్.అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రత్యేక జాబితాలో భారత సంతతికి చెందిన ప్రముఖులు సత్తా చాటారు. అమెరికాలో నివసిస్తున్న విజయవంతమైన 250 మంది వలసదారుల జాబితాలో ఏకంగా 27 మంది భారతీయ మూలాల వ్యక్తులు చోటు…
- విమానంలో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎక్కడికెళ్లినా తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయన విమానంలో క్రికెట్ ఆడి అందరినీ అశ్చర్య పరిచారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓ ప్రైవేట్ విమానంలో ప్రయాణించిన సచిన్… అందులోనే సరదాగా టెన్నిస్ బాల్ క్రికెట్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 141238