Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Latest News సస్పెన్షన్‌ను ఎత్తివేసిన ఎన్నికల సంఘం….

సస్పెన్షన్‌ను ఎత్తివేసిన ఎన్నికల సంఘం….

by Prakash
The Election Commission has lifted the suspension

ఐఏఎస్ అధికారి అంజనీకుమార్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎన్నికల సంఘం ఎత్తివేసింది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు పూర్తిగా విడుదల కాకముందే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసిన అప్పటి డీజీపీ అంజనీకుమార్ చర్యను ఈసీ తీవ్రంగా పరిగణించి సస్పెండ్ చేసింది. తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ అంజనీకుమార్ ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఓట్ల లెక్కింపు రోజున తాను ఉద్దేశపూర్వకంగా రేవంత్‌ను కలిసి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించలేదని, రేవంత్ పిలిస్తేనే తాను వెళ్లినట్టు వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో మరోమారు ఇలాంటివి జరగవని హామీ ఇచ్చారు. అంజనీకుమార్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ సస్పెన్షన్‌ను ఎత్తవేస్తూ ఈ రోజు నిర్ణయం తీసుకుంది.

Advertisements

You may also like

Our Visitor

026017
Total views : 149708

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.