Follow us on : Facebook, Instagram, YouTube & Google News
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం లో మూడవరోజు ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరదేవి ఎన్నికల ప్రచారం (Vasundhara devi election campaign) చేస్తున్నారు. గ్రామ, గ్రామానికి వెళ్లి ప్రచార రథం పై ఓటర్లను అభ్యర్థించారు. ప్రధానంగా మహిళా ఓటర్లను కలుసుకొని బాలకృష్ణ ను మూడోసారి గెలిపించాలని కోరుతున్నారు. వెంకటాపురం గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలో రాగి చేను కోస్తున్న కూలీలను చూసి అక్కడికి వెళ్లారు. వసుంధర దేవి కూలీలతో పాటు రాగి చేను కోసారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే హిందూపురం మరింత అభివృద్ధి దిశగా వెళుతుందని మహిళా ఓటర్ల కు సూచించారు. భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేస్తూ బాలకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మహిళ ఓటర్లను అభ్యర్థించారు.
- అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.
- పవన్ కళ్యాణ్‌పై జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఫిర్యాదు.
- నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో యువతికి ఎమ్మెల్యే ప్రశంసలు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 194132