Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra PradeshEast Godavari వంగలపూడి గ్రామంలో చేతివాటం చూపించిన గ్రామ వాలంటీర్

వంగలపూడి గ్రామంలో చేతివాటం చూపించిన గ్రామ వాలంటీర్

by Rama
Grama Sachivalayam

వంగలపూడి గ్రామం (Wangalapudi village):

సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో తిగిరిపల్లి మార్తమ్మ అను మహిళ భర్త గత ఏడాది అనారోగ్యం కారణంగా మరణించడంతో ప్రభుత్వం నుండి వచ్చిన 1,08075 రూపాయలు మరియు మట్టి ఖర్చు నిమిత్తం ప్రభుత్వం నుండి వచ్చిన 10వేల రూపాయలను వంగలపూడి గ్రామ సచివాలయం వాలంటీర్ గా పనిచేస్తున్న కోడెల్లి చిన్న రాము అనే యువకుడు ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం ద్వారా వంగలపూడి ఇండియన్ బ్యాంకు ఖాతా నుండి డబ్బులు కాజేసాడని తిగిరిపల్లి మార్తమ్మ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. బాధిత మహిళ తిగిరిపల్లి మార్తమ్మ డబ్బులు కాజేయడంలో వంగలపూడి గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ చింతా శివ ప్రసాద్ పూర్తి సహకారం ఉన్నట్లుగా గ్రామ పెద్దలు, గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఇలాంటి సచివాలయ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి కఠిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

వంగలపూడి గ్రామం (Wangalapudi village) లో గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్న ఈ యువకుడికి ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం వంటి ఉపాధిని ఏరకంగా ఇస్తారని గ్రామ పెద్దలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లపై మండల అధికారి ఎంపీడీవో చర్యలు తీసుకోవలసి ఉన్నా గానీ పట్టించుకోకపోవడం హాస్యాస్పదంగా ఉందని ప్రజాసంఘాలు అంటున్నాయి. ప్రభుత్వం నుండి నా భర్తకు రావలసిన డబ్బులు పడ్డాయా లేదా అని అడిగినప్పుడల్లా బ్యాంకు ఖాతా నుండి డబ్బులు వాలంటీర్ కాజేసినట్లుగా బ్యాంకు అధికారులు తెలియజేశారని బాధిత మహిళ విలేకరులకు తెలిపారు. ఇదిలా ఉండగా సీతానగరం పోలీస్ స్టేషన్ నందు భాదిత మహిళ అందజేసిన ఫిర్యాదు పై ఎస్సై టి రామకృష్ణ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇలాంటివి మరలా మరలా పునారావృతం కాకుండా అమాయకుల బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టే వారిపై మండల, జిల్లా అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని భాదిత మహిళ కుటుంభీకులు కోరుకుంటున్నారు. Read Also..

  • ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం..
    రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులోని బాలికల ఉన్నత పాఠశాలలో కొలుసు పెద్దరెడ్డయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో…
  • శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..
    శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువయ్యాయి. పట్టణంలో నూతనంగా నిర్మించిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ కలిసి ఘనంగా ప్రారంభించారు.దాదాపు రూ.2 కోట్ల…
  • ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్‌.
    భవిష్యత్‌ న్యూక్లియర్‌ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్‌ను నమ్మకమైన గ్లోబల్‌ భాగస్వామిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ స్పష్టం చేశారు. న్యూక్లియర్ ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన ‘యూఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014625
Total views : 80623

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.