Thursday, October 1, 2026
News Navigation
Thursday, October 1, 2026
News Navigation

Breaking

Thursday, October 1, 2026
Home Andhra Pradesh డ్రగ్స్ వెనుక వైసీపీ హస్తమే.. కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు..!

డ్రగ్స్ వెనుక వైసీపీ హస్తమే.. కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు..!

by Satya
Kollu Ravindra

విశాఖను డ్రగ్స్(Drugs) క్యాపిటల్‍గా మార్చారని ఆరోపణ.. కొల్లు రవీంద్ర(Kollu Ravindra)..

విశాఖ(Visakhapatnam)లో దొరికిన డ్రగ్స్ వెనుక వైసీపీ పెద్దల హస్తమే ఉందంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పాలనలో ఏపీని నాశనం చేసారన్నారు. గంజాయి, డ్రగ్ రవాణాలో అగ్రస్థానంలో ఏపీ నిలిచిందని ఎద్దేవా చేశారు. విశాఖను డ్రగ్స్ క్యాపిటల్‍గా మార్చారని ఆరోపించారు.

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

విశాఖలో బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న 25వేల కిలోల డ్రైడ్ ఈస్ట్ తో కలిపి ఉన్న డ్రగ్స్ ను పట్టుకునే సమయంలో కొందరు అధికారులు అడ్డుపడ్డారని సీబీఐ తన నివేదికలో పేర్కొందన్నారు. ఈ డ్రగ్స్ కంటెయినర్ ని వైసీపీ నేత కూనం పూర్ణచంద్రరావు సోదరుడు వీరభధ్రరావుకి చెందిన కంపెనీ దిగుమతి చేసుకుందని ఆరోపించారు. విశాఖలో దొరికిన 25 వేల కిలోల డ్రగ్స్ మాఫియా వెనుక వైసీపీ హస్తం ఉందంటూ ట్విట్టర్‍లో వేల సంఖ్యలో నెటిజన్ల ట్వీట్లు చేశారన్నారు.

ఇది చదవండి: Chandrababu: పార్లమెంట్ అభ్యర్థుల పట్ల పలు జాగ్రత్తలు..


బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ …
అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ …
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక నిమజ్జనాలు.
తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నింటుతున్నాయి. ఊరూ వాడా ఏకదంతుడి జయజయధ్వానాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. భక్తి …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: