Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra PradeshKarnool వైసీపీ పార్టీ కి షాక్ మీద షాక్…

వైసీపీ పార్టీ కి షాక్ మీద షాక్…

by Rama
YCP To TDP

వైసీపీ (YCP):

జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో అరాచకాలు తప్ప అభివృద్ధి లేదని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు. పట్టణంలోని గౌడ లే అవుట్ లో ఆయన పర్యటించారు. వైసీపీ (YCP)కి చెందిన 50 కుటుంబాల వారికి పార్టీ కండువాలు వేసి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ రెడ్డి పాలనలో నిత్యావసరాల ధరలతో పేద,మధ్య కుటుంబాల జీవితాలు చిన్నా భిన్నమయ్యాయని బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఏమి తినలేని, కొనలేని దుస్థితికి వైసీపీ సర్కార్ తీసుకొచ్చిందన్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

జగన్ గెలిచాక తొమ్మిది సార్లు కరెంట్ చార్జీలను పెంచాడన్నారు. వంట గ్యాస్ ధరలు కూడా మూడింతలు పెరిగాయన్నారు. చంద్రబాబు పాలనలో నిత్యావసరాల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవని కాలవ గుర్తు చేశారు. రాష్ట్రంలో పేదల వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందన్నారు. చంద్రబాబు పాలనతోనే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. తేదేపా పార్టీ ఉన్నప్పుడు గోడ లే అవుట్ లో తాగు నీటి సౌకర్యం, ఎన్నో రకాల ప్రజా సమస్యలు తీర్చమన్నారు. రాబోయే రోజుల్లో తెదేపా పార్టీ అధికారంలోకి రాగానే మిగిలిన ప్రజా సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు. Read Also..

  • చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.
    తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసన తెలిపారు. ‘నిజం గెలిచింది’ అనే నినాదంతో ఉండవల్లిలోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించి నాటి…
  • సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.
    సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ఎన్నికల హామీ మేరకు…
  • భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
    సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపడమే అసలైన సుపరిపాలన అని అన్నారు.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: