Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Technology ఇన్‌స్టాగ్రామ్‌లో మరో నాలుగు అద్భుత ఫీచర్లు..

ఇన్‌స్టాగ్రామ్‌లో మరో నాలుగు అద్భుత ఫీచర్లు..

by Rama
Instagram New Features

ఇన్‌స్టాగ్రామ్‌ లాంచ్‌ అయిన 13 ఏళ్లు గడుస్తోన్న సందర్భంగా 4 కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. కొత్త ఫీచర్స్‌లో డేట్స్‌ రిమైండర్‌ ఒకటి. ఈ ఫీచర్‌ ఫాలోయర్లకు, స్నేహితులకు మీ పుట్టిన తేదీని గుర్తు చేస్తుంది. స్టిక్కర్లు, కాన్ఫెటీలతో విషెస్‌ చెప్పేలా డిజైన్‌ చేశారు. కొందరికి మాత్రమే మీ స్టోరీలు కనిపించేలా‘క్లోజ్‌ ఫ్రెండ్స్‌’అనే ఫీచర్‌ను అప్‌డేట్‌ చేసి స్టోరీలకు మరిన్ని క్యాటగిరీలు యాడ్ చేయనున్నారు. ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ, కోలిగ్స్‌ ఇలా క్యాటగీరి వారీగా స్టోరీలను షేర్ చేసుకోవచ్చన్నమాట. వాయిస్‌ మెసేజ్‌ ఫీచర్‌ను అప్‌డేట్‌ చేసి నోట్స్‌ సెక్షన్‌ నుంచే ఆడియో మెసేజ్‌లు పోస్ట్ చేయొచ్చు. ఇవి డైరెక్ట్ మేసేజ్‌ లిస్ట్‌లో అన్నింటికంటే పైన కనిపిస్తాయి. ఇక కేవలం ఆడియో నోట్స్‌ మాత్రమే కాకుండా, చిన్న చిన్న వీడియోలను రికార్డ్‌ చేసి కూడా నోట్‌గా పోస్ట్ చేయొచ్చు. ఈ పోస్ట్ కేవలం 24 గంటల వరకు ఉంటుంది. ఇక చివరిగా లొకేషన్‌ను ట్యాగ్‌ చేసుకునే ఫీచర్. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు తాము ఎక్కడున్నామో తెలపుపొచ్చు. ట్యాగ్‌ చేసిన లొకేషన్‌ నోట్స్‌లో టెక్ట్స్‌ మీద కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొస్తున్న ఈ నాలుగు కొత్త ఫీచర్లు ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్నాయి. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: