Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Health శరీరం మృదువుగా ఉండడానికి బాడీలోషన్‌

శరీరం మృదువుగా ఉండడానికి బాడీలోషన్‌

by Satya
Body lotion

శరీరం మృదువుగా ఉండాలంటే మంచి బాడీ లోషన్‌ రాసుకోవాల్సిందే. అలాగని ఎంతో ఖర్చుపెట్టి వాటిని కొనాల్సిన పని లేదు. ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. మూడు టేబుల్‌ స్పూన్ల రోజ్‌ వాటర్‌కి, ఒక స్పూను గ్లిజరిన్‌, రెండు టీ స్పూనుల నిమ్మరసం కలపండి. ఆ మిశ్రమాన్ని చిన్న సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. అసరమైనప్పుడు తీసి వాడుకుంటూ ఉంటే, చర్మం పొడి బారకుండా, మృదువుగా ఉంటుంది. కప్పు రోజ్‌ వాటర్‌లో టీ స్పూను బొరాక్స్‌ పొడినీ, రెండు టీ స్పూన్ల వేడి చేసిన ఆలివ్‌ ఆయిల్‌ని బాగా కలపండి. మార్కెట్లో లావెండర్‌ వాటర్‌ దొరుకుతుంది. దీనిని పై మిశ్రమంలో కలిపి బాగా గిలక్కొట్టండి. కాసేపయ్యాక వాడుకోవచ్చు. సబ్బుని చిన్న చిన్న ముక్కల్లా చెక్కుకొని, మూడు టీ స్పూన్ల నిండా దాన్ని తీసుకోవాలి. దానిని పావు కప్పు నీళ్లలో కలిపి వేడి చేసి, నాలుగు స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌నీ, టీ స్పూను గ్లిజరిన్‌నీ దాన్లో వేసి బాగా కలపాలి. తయారైన మిశ్రమాన్ని ముఖ వర్ఛస్సుకు రాసుకోవచ్చు.

Advertisements

You may also like

Our Visitor

026211
Total views : 150047

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.