Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh చంద్రబాబు నివాసంలో చండీయాగం, సుదర్శన నారసింహ హోమం…

చంద్రబాబు నివాసంలో చండీయాగం, సుదర్శన నారసింహ హోమం…

by Prakash
Chandi Yagam, Sudarshan Narasimha Homa in Chandrababu's residence...

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో నేడు చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా మొదటి రోజు యజ్ఞ క్రతువులు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. ప్రజలందరికీ మేలు జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు – భువనేశ్వరి దంపతులు ప్రార్థించారు. గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల వారి పర్యవేక్షణలో 40 మంది రిత్వికులు యాగం నిర్వహించారు. రేపు, ఎల్లుండి కూడా యజ్ఞహోమాది కార్యక్రమాలు జరగనున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు పార్టీ నేతలు కుటుంబ సభ్యులతో కలిసి యాగంలో పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

014396
Total views : 80099

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.