వనపర్తి జిల్లా, కొత్తకోట పట్టణ కేంద్రంలో చల్లా వంశీచంద్ రెడ్డి న్యాయ యాత్ర కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్థీనివాస్ రెడ్డి.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
Table of Contents
Follow us on : Facebook, Instagram & YouTube.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) కామెంట్స్……
పాలమూరు జిల్లా అంటే బాగా వెనుకబడిన జిల్లా. అలాంటి వెనుకబడిన జిల్లాను అభివృద్ది పరిచేందుకు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కలలు గన్నాడు. ఎన్నో ప్రాజెక్టులను అనాడు వైస్ రాజశేఖర రెడ్డి హాయాంలో పాలమూరు కు తెచ్చి ఘనత కాంగ్రెస్ దే. కల్లబొల్లి మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను కెసిఆర్ తప్పు దారి పట్టించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కెసిఆర్ కు బుద్ది రాలేదు. ఇంకా కెసిఆర్ తనే సీఎం అనుకుంటున్నాడు. కృష్ణా జలాలపై కెసిఆర్ అవాక్కులు చెవాక్కులు పేలుస్తున్నాడు. ఈరోజు పాలమూరు జిల్లాలో వున్న ప్రతి పాజెక్టు ను తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే.
తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ను మోసం చేసి. ప్రాంత విభేధాలు సృష్టించి ప్రజలను నట్టేట ముంచారు. తప్పడు మాటలతో కృష్ణా జలాల పై కెసిఆర్ రాజకీయం చేస్తున్నాడు. కేసీఆర్ నీకు సవాల్ విసురుతున్నా నీవు కాంగ్రెస్ పై చేస్తున్న అవినీతి ఆరోపణపై సాక్ష్యాలు చూపించాలి. తెలంగాణ రాష్ట్రంలో 7లక్షల కోట్లు అప్పచేసిన ఘనత కెసిఆర్ ది. కాలేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడితే బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్రాజెక్టుల పై చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కృష్ణా జలాలను కేంద్ర ఫ్రభుత్వానికి అప్పజెప్పారని తప్పుడు కూతలు కూస్తున్నారు.
కృష్ణా జలాలను తెచ్చి ఒక్క ఎకరాకు కూడా నీల్లు ఇవ్వలేని చవటలు మీరు దత్తత. చేతకాని సన్నాసులు ఇందిరమ్మ రాజ్యం గూర్చి మట్లాడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చు కుంటూ ముందుకు వెలుతుంది. వచ్చిన 2నెలలకీ మాపై బిఆర్ఎస్ సన్నాసులు ఎదురదాడి చేస్తున్నారు. బిఆర్ఎస్ 10సంవత్సరాల కాలంలో నేతలు గుడ్డి గుర్రానికి పల్లు తోమారా.
దరణి పేరుతో పేద ప్రజల భూములను బిఆర్ఎస్ రాబందులు దోచుకున్నారు. ప్రజలు గడ్డిపెట్టి చెప్పినా కెసిఆర్ కు బుద్ది రాలేదు. డిల్లీ లో వున్న పార్టీ గూర్చి కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు పిల్ల నాయకులు ఇందిరమ్మ రాజ్యం గూర్చి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని టచ్ చేస్తే మాడి మసైపోతారు. దేవుడిపై రాజకీయం చేస్తున్న పార్టీ బీజేపీ. బీజేపీ పార్టీకి బి పార్టీ బీఆర్ఎస్. వచ్చే పార్లమెంట్ ఎన్నిక్లలో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించుకోవాలి.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.