Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home International హౌతీ మిలిటెంట్లకు షాక్‌…

హౌతీ మిలిటెంట్లకు షాక్‌…

by Prakash
A shock to the Houthi militants

ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నహౌతీ మిలిటెంట్లకు అమెరికా, బ్రిటన్‌ సంయుక్త దళాలు షాక్‌ ఇచ్చాయి. హౌతీలకు చెందిన డజన్ల కొద్దీ డ్రోన్‌లను కూల్చివేసినట్లు అమెరికా మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది. హౌతీలకు చెందిన 28 దాకా అన్‌ మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికిల్స్ ను ఎర్ర సముద్రంలో కూల్చివేశాం అని పేర్కొంది. హౌతీల దాడిలో అమెరికా సంయుక్త దళాల నౌకలతో పాటు వాణిజ్య నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదు అని US సెంట్రల్‌ కమాండ్ వెల్లడించింది. ఇజ్రాయెల్‌, పాలస్తీనా యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా హౌతీలు ఎర్ర సముద్రంలోని గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌ వద్ద అమెరికా, ఇజ్రాయెల్‌లకు చెందిన వాణిజ్య నౌకలపై డ్రోన్‌లు, మిసైళ్లతో దాడులు చేస్తున్నారు. ఈ దాడులు గత ఏడాది నవంబర్‌ నుంచి మొదలయ్యాయి. వీటిని అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ సంయుక్త దళాలు తిప్పికొడుతున్నాయి.

Advertisements

You may also like

Our Visitor

026107
Total views : 149927

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.