ముస్లిం ఫ్యామిలీ(Muslim family):
బైక్‌పై వెళ్తున్న ముస్లిం ఫ్యామిలీపై కొందరు రంగులు పోసి వేధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు బిజ్నోర్ పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బిజ్నోర్ జిల్లా(Bijnor District)లోని ధాంపూర్ లో కొందరు వ్యక్తులు ముందస్తు హోలీ వేడుకలు జరుపుకున్నారు. కాగా.. అక్కడ రోడ్డులో బైక పైన వెళ్తున్న ముస్లిం ఫ్యామిలీని వేధించారు. ఇద్దరు మహిళలతో సహా వ్యక్తిపై రంగులు చల్లారు. కలర్ వాటర్ వారిపై పోశారు. దీన్ని అడ్డుకున్న వారి ముఖాలకు రంగులు పూశారు. హర్ హర్ మహాదేవ్, జైశ్రీరామ్(Jaishreeram) అంటూ మత పరమైన నినాదాలు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: చైనా ప్రవర్తనపై మండిపడ్డ జైశంకర్
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి