Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home TelanganaKarimnagar హోలీ సంబరాల్లో మునిగితేలిన బండి సంజయ్

హోలీ సంబరాల్లో మునిగితేలిన బండి సంజయ్

by Rama
Bandi sanjay

హోలీ పండుగను పురస్కరించుకుని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) కరీంనగర్ లో ఈరోజు హోలీ సంబురాల్లో (Holi Celebrations) పాల్గొన్నారు. ఉదయం ఇంటి వద్దకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చి బండి సంజయ్ పై రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

ఉదయం బండి సంజయ్ తన సతీమణితో కలిసి హోలీ సంబురాలు జరుపుకున్న బండి సంజయ్ కుమార్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ద్విచక్ర వాహనంపై ఎక్కి గల్లీ గల్లీ తిరుగుతూ కన్పించిన వారందరికీ రంగులు పూసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. దారిలో కన్పించిన పారిశుధ్య కార్మికుల వద్దకు వెళ్లి రంగులు పూసి ఆప్యాయంగా పలకరిస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దారిలో కన్పించిన ఆటో డ్రైవర్లు, కూలీలు, చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి రంగులు పూస్తూ హోలీ సంబరాలు జరుపుకున్నారు.

ఇక చిన్నారులు, స్కూల్ విద్యార్థులో హులీ వేడుకల్లో మునిగితేలారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులకు సైతం రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ హిందూ బంధువులందరికీ హోలీ పర్వదిన శుభుకాంక్షలు తెలిపారు. హిందూ ధర్మంలో ప్రతి పండుగకు ఒక పరమార్థం ఉంటుందన్నారు. రంగు రంగులతో జరుపుకునే ఈ హోలీ పండుగ పిల్లలు, పెద్దలుసహా ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో రంగుల మయం కావాలని, కొత్త ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఇది చదవండి: కళ తప్పిన కేబుల్ బ్రిడ్జి..


ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.
ఎన్నికల కమిషన్‌ నిర్ణయాలు పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రక్రియలో …
కాంగ్రెస్ నేతల క్షుద్రపూజల ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన హరీష్‎రావు.
తాను క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం చేసిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ …
మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాల ప్రారంభం.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాలను మంత్రి సీతక్క ప్రారంభించారు.సింగరేణి సీఎస్‌ఆర్ నిధులు రూ.15 …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: