Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh Ambati Rambabu : నా అల్లుడి వెనుక పవన్ కల్యాణ్ ఉన్నాడు..

Ambati Rambabu : నా అల్లుడి వెనుక పవన్ కల్యాణ్ ఉన్నాడు..

by Satya
Ambati Rambabu

ఈ నెల 13న పోలింగ్ జరగనుండగా, మా అల్లుడు ఒక వీడియో రిలీజ్ చేశాడని మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) తెలిపారు. కానీ ఇప్పుడు నేను దీనిపై ఎందుకు మాట్లాడుతున్నానంటే… ఈ వీడియో అంశాన్ని పవన్ కల్యాణ్ పొన్నూరులో ప్రస్తావించారు. మా అల్లుడు గౌతమ్, నా కుమార్తె విడాకులు తీసుకుంటున్నారు. ఆ ప్రక్రియ నడుస్తోంది. గతంలో కూడా గౌతమ్… నేను పవన్ కల్యాణ్(Pawan Kalyan) ను కలుస్తాను, నేను చంద్రబాబు(Chandrababu)ను కలుస్తాను అని మా అమ్మాయితో అనేవాడు. విడాకులు ఇవ్వడానికి నా కూతురుకేమీ అభ్యంతరం లేదు… అయితే ఆమెకు పిల్లలున్నారు… వారి భవిష్యత్తు ఏమిటో తేలాలి కదా.

Follow us on : FacebookInstagramYouTube & Google News

ఈ విషయంలోనే కోర్టులో మేం న్యాయపోరాటం చేస్తున్నాం. ఇది మా కుటుంబ విషయం. బయటివారికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కూతురుకు సంబంధించిన విషయం కాబట్టి బహిర్గతం చేయాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. నా అల్లుడి మాటల వెనుక పవన్ కల్యాణ్ ఉన్నాడు. పవన్ కల్యాణే అతడితో మాట్లాడించాడు, చంద్రబాబు అందుకు సపోర్ట్ చేస్తున్నాడని ఆరోపించారు. నేను సత్తెనపల్లిలో గెలవబోతున్నానని తెలిసిన తర్వాత ఇలాంటి చవకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. నా ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నన్ను ఓడించాలనుకుంటున్న పవన్ కల్యాణ్, నన్ను అసెంబ్లీకి రానివ్వకూడదనుకుంటున్న చంద్రబాబునాయుడు కలిసికట్టుగా ఆడుతున్న నాటకం ఇదని అంబటి ఫైర్ అయ్యారు.


  • కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.
    మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో…
  • తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.
    తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లడంతో ప్రత్యామ్నాయంగా మరో టీచర్‌ను నియమించకపోవడంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు.ప్రస్తుతం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు…
  • అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.
    అనంతపురం జిల్లాలోని 9 డివిజన్లు, 18 కాలనీల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. నగరంలోని నడిమివంకపై ఉన్న ఆక్రమణల తొలగింపు పనులను మున్సిపల్ కమిషనర్ జస్వంత్ కుమార్‌తో కలిసి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

025947
Total views : 149552

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.