కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు పెద్ద పీట వేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీయే సర్కారు కట్టుబడి ఉందని పేర్కొంటూ ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు ప్రకటించారు. అంతేకాదు, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ లో అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయంగా అందిస్తామని చెప్పారు. దీంతో పాటు అమరావతి అభివృద్ధికి అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయడానికి ఏపీ ప్రభుత్వానికి సహాయసహకారాలు అందిస్తామని అన్నారు. ఇక, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. విశాఖ- చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్- బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు కేటాయించామని వివరించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మలేషియాలో మంత్రి నారాయణ పర్యటన.ఏపీ మంత్రి నారాయణ మలేషియాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం మలేషియా చేరుకున్న మంత్రి నారాయణ కు ఘన స్వాగతం లభించింది.కౌలాలంపూర్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి నారాయణతో క్లాంగ్ ఎంపీ గణపతిరావు,మంత్రి…
- ఆంధ్రప్రదేశ్‌లో 43 మంది వైద్యుల డిస్మిస్.ఏపీలో ప్రభుత్వ వైద్య సేవలను నిర్వీర్యం చేస్తున్న వైద్యులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఏళ్ల తరబడి అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 43 మంది డాక్టర్లను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్య సేవల్లో…
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం.ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 18వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పలు కీలక రంగాలకు చెందిన ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.అమరావతిలోని ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…
- మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్ విసిరారు మంత్రి లోకేష్. డీఎస్సీపై చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. ‘‘జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నా. గొడ్డలి పార్టీ నేతల్లా బురద చల్లి పారిపోయే రకం కాదన్నారు.…
- చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో భారీ మైలురాయిని అందుకుంది. 400 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ రూరల్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 147986