ఏపీ డిప్యూటీ సీఎంపవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసును ఎత్తివేసిన కోర్టు పెద్ద ఊరటను కలిగించింది. ఆయనపై గతంలో నమోదైన క్రిమినల్ కేసును కోర్టు ఎత్తివేసింది. వాలంటీర్లను ఉద్దేశించి గతంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జులై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో ఆయన ప్రసంగిస్తూ ఈమేరకు ఆరోపించారు. ఇంట్లో మగవాళ్లు లేని సమయంలో వెళ్తున్నారని, దండుపాళ్యం బ్యాచ్ మాదిరి తయారయ్యారని, వాలంటీర్ వ్యవస్థలో జవాబుదారీతనం లేదంటూ వ్యాఖ్యానించారు. దీంతో పవన్ పై కడప, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయగా..పవన్ కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు, గుంటూరు కోర్టు తాజా విచారణలో… పవన్ పై తాము ఫిర్యాదు చేయలేదని వాలంటీర్లు తెలిపారు. ఆ సంతకాలు తమవి కాదని చెప్పారు. దీంతో కేసును ఎత్తివేస్తూ గుంటూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా జరిగిన చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. కేసులకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో…
- రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్ కుమార్ గౌడ్.కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా పార్టీకి సంబంధించిన అంశాలపై మాట్లాడటం సబబు కాదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణిస్తున్నామని.. ఈ వ్యవహారంపై హైకమాండ్ దృష్టి కూడా ఉందన్నారు.…
- ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఈ నెల 25న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. కనేకల్-1, కనేకల్-2 పేర్లతో ఏర్పాటు చేయబోయే పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో…
- సింహాచలంలో వైభవంగా శ్రావణ శుక్రవారం పూజలు.విశాఖపట్నం సింహాచల పుణ్యక్షేత్రంలో శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రీ సింహవల్లి తాయారు సన్నిధిలో లక్ష కుంకుమార్చన పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రావణమాసంలో తొలి శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తుండటంతో.. ప్రత్యేక పూజలకు భక్తులు…
- బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.హైదరాబాద్ బాలానగర్‌లో గంజాయి ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన తెలంగాణ ఈగల్ పోలీసులకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. నిందితులు పోలీసులపై కుక్కను వదలడంతో పాటు స్క్రూడ్రైవర్‌తో దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో నిందితుడు పక్క భవనాలపైకి దూకుతూ తప్పించుకునే ప్రయత్నం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి