కాకినాడ జిల్లా ప్రజలు తుఫాను భయంతో వణికి పోతున్నారు. రాష్ట్రానికి పెద్దగా తుఫాన్ ఎఫెక్ట్ ఉండదని అధికారులు చెప్పినప్పటికీ తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉప్పడ సముద్రం వద్ద కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఉప్పాడ, కొత్తపల్లి ప్రాంతంలో కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే పంట కోతలు పూర్తి కాగా రైతులు ధాన్యం ఆరబోసుకున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో ఎండకు ఆరబెట్టి ధాన్యం విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వర్షం వల్ల రైతులు ఆరబోసుకున్న ధాన్యం తడిసిముద్దయ్యింది. చాలా మంది రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే వెనక్కు పంపుతారన్న భయంతో తక్కువ ధరకే మిల్లర్లుకు అమ్మేస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. సుమారు 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న SIR- 2026 కార్యక్రమాన్ని జూన్ 25 నుంచి చేపట్టనున్నారు. ఈ కార్యక్రమ సన్నద్ధతపై రాష్ట్ర సీఈవో సి. సుదర్శన్ రెడ్డి అధికారులతో…
- హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాలలు, కళాశాలలను మాదకద్రవ్య రహిత విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి,…
- కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో…
- హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
- అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్‌హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 150412