Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Telangana మోహన్ బాబు, విష్ణు, మనోజ్ కు నోటీసులు

మోహన్ బాబు, విష్ణు, మనోజ్ కు నోటీసులు

by Rama
మోహన్ బాబు, విష్ణు, మనోజ్ కు నోటీసులు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మంచు కుటుంబ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మోహన్​బాబు, మనోజ్​ మధ్య జరుగుతున్న వివాదం మరింత ముదిరింది. పరస్పర ఫిర్యాదులతో రచ్చకెక్కిన ఈ వ్యవహారం ఘర్షణలతో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈనేపథ్యంలో మోహన్​బాబుతో పాటు తన కుమారులైన మంచు మనోజ్​, విష్ణులకు రాచకొండ సీపీ సుధీర్​ బాబు అదనపు జిల్లా మేజిస్ట్రేట్​ హోదాలో నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. జల్​పల్లిలో జరిగిన దాడి ఘటనపై సీపీ ముగ్గురిని విచారణ చేయనున్నారు. జల్​పల్లిలోని మంచు మోహన్​బాబు ఇంటి వద్ద జరిగిన దాడి ఘటనపై రాచకొండ సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మోహన్​బాబు, మనోజ్​లకు చెందిన తుపాకులను పోలీసులు సీజ్​ చేశారు. గచ్చిబౌలి ఆసుపత్రిలో మోహన్​బాబు చికిత్స పొందుతున్నారు.

మంచు కుటుంబ వివాదం నేపథ్యంలో విదేశాల్లో ఉన్న విష్ణు మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు తిరిగి రావడంతో మోహన్‌బాబు శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లి జల్‌పల్లిలోని నివాసానికి తీసుకొచ్చారు. అప్పటికి మనోజ్‌ అక్కడే ఉన్నారు. వివాదానికి తెరదించేందుకు మోహన్‌బాబు, విష్ణు, మరికొందరు సన్నిహితుల సమక్షంలో మనోజ్‌తో చర్చలు జరిగాయి. అయితే మనోజ్, తన భార్యతో కలిసి మధ్యలోనే బయటకు వచ్చేశారు. ఈ సమయంలో విష్ణు తరఫు బౌన్సర్లు మనోజ్‌ బౌన్సర్లను బలవంతంగా ఇంటి నుంచి బయటకు పంపించారు. దీంతో గేటు దగ్గర కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మనోజ్‌, తాను ఆస్తి కోసం పోరాడటం లేదని, ఇది ఆత్మగౌరవం కోసమని వ్యాఖ్యానించారు. తన తరఫు వారిని కానిస్టేబుళ్లు బెదరగొట్టి ఇంటి నుంచి బయటకు పంపించారని, ఇతరుల అంగరక్షకులను లోపలికి పంపించారని ఆరోపించారు. అనంతరం తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని సాయంత్రం ఇంటెలిజెన్స్‌ డీజీ శివధర్‌రెడ్డి, శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌లకు మనోజ్‌ ఫిర్యాదు చేశారు.

పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో జల్‌పల్లిలోని నివాసానికి మనోజ్‌ తిరిగి చేరుకున్నారు. భద్రతా సిబ్బంది గేట్లు తెరవకపోవడంతో తన సిబ్బందితో కలిసి గేటును గట్టిగా నెట్టి లోపలికి వెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపటికి చిరిగిన చొక్కాతో బయటకు వచ్చిన మనోజ్‌, బౌన్సర్లు తనపై దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోహన్‌బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు, సహాయకులు గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో దాడిచేశారు. ఓ ఛానెల్‌ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్‌బాబు మైకు లాక్కుని ముఖంపై కొట్టారు. బౌన్సర్లు నెట్టేయడంతో ఓ ఛానల్‌ కెమెరామెన్‌ కింద పడ్డారు. ఈ సంఘటన జరిగినప్పుడు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ గురువారెడ్డి అక్కడే ఉన్నారు. దాడిని నిరసిస్తూ మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. మోహన్‌బాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.
    హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా దేశంలోకి చొరబడిన వీరు… కొంతకాలంగా ఇక్కడే ఉంటూ…
  • స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
    విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
  • మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.
    మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు లక్ష…
  • కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.
    కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో చిన్నారితో వెళ్లిన పెంపుడు కుక్క తోట నుంచి తిరిగొచ్చిన తర్వాత మృతి చెందడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి జాహ్నవి వెంట వెళ్లి తిరిగి వచ్చిన కుక్క.. రెండ్రోజులుగా…
  • ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.
    వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమ‌వుతున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్‌, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ,…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

023248
Total views : 141654

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.