మంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల. మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు. ఈ విషయంపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు నిర్మల లేఖ రాశారు. డిసెంబర్ 14వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు జల్పల్లిలోని తమ ఇంటికి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడని తెలిపారు. అయితే ఈ విషయంలో విష్ణుపై మంచు మనోజ్ అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని అన్నారు. మంచు విష్ణు తన పుట్టినరోజు నాడు ఎలాంటి గొడవ చేయలేదన్నారు. ఇంటికి వచ్చి తన గదిలోని వస్తువులు తీసుకుని కొద్దిసేపు తనతో మాట్లాడి వెళ్లిపోయాడని లేఖలో తెలిపారు. ఈ ఇంటిపై మనోజ్‌కు ఎంత హక్కు ఉందో, పెద్ద కుమారుడు అయిన విష్ణుకి సైతం అంతే హక్కు ఉందని స్పష్టం చేశారు. విష్ణు తన పుట్టినరోజు నాడు మనుషులతో ఇంట్లోకి రాలేదని, మనోజ్ ఫిర్యాదులో ఎటువంటి నిజం లేదని విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడు అని వెల్లడించారు. ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మేమిక్కడ పని చేయలేమంటూ వాళ్లే మానేశారని, ఇందులో విష్ణు ప్రమేయం ఏమీ లేదని ఆ లేఖలో మంచు నిర్మల తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- సింగరేణి కార్మికులకు శుభవార్త.సింగరేణి మెడికల్ బోర్డును అత్యంత పారదర్శకంగా, వివాదరహితంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. వివిధ కారణాల వల్ల కొద్దికాలంగా నిలిచిపోయిన ఈ మెడికల్ బోర్డు ప్రక్రియను…
- తెలంగాణ అభివృద్ధికి ఎవరు కుట్రలు చేస్తున్నారో తెలుసు..సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా నిర్వహించిన చిట్ చాట్ లో రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంపై మాట్లాడుతూ.. కిషన్ రెడ్డిపై ఫైరయ్యారు. తెలంగాణ ప్రాజెక్టుల్ని అడ్డుకుంటోంది కిషన్ రెడ్డేనని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిపై…
- ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభం.మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
- ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హర్మూజ్ జలసంధిని తిరిగి…
- ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 141144