మంచు కుటుంబంలో గొడవల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జల్లిపల్లిలోని ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంచు మనోజ్ బౌన్సనర్లు మరో వైపు విష్ణు బౌన్సర్లు మధ్య గొడవ జరిగింది. మనోజ్‌ను విష్ణు బౌన్సర్లు బయటకు పంపిస్తున్నారు. మౌనికతో బౌన్సర్లు వీడియో కాల్ మాట్లాడారు. విష్ణు బయటకు వచ్చి బౌన్సర్లుని బయటకు తోసేశారు. మోహన్ బాబు ఫామ్‌హౌస్‌కు పహడి షరీఫ్ పోలీసులు చేరుకున్నారు. మంచు మనోజ్ దాడి ఫుటేజ్ మాయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. తండ్రి మోహన్‌బాబు తనపై చేసిన ఫిర్యాదుపై మంచు మనోజ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని, ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నింటిని విజయ రెడ్డి , కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్లిపోయారని మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదని..ఆస్తుల కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని అన్నారు. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని ఫిర్యాదు చేశానన్నారు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరానన్నారు. కుటుంబ ఆస్తుల కోసం తాను ఎప్పుడూ ఆశ పడలేదని, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానని చెప్పారు. ఈ వివాదాల్లో తన కూతుర్ని తీసుకు రావడం చాలా బాధాకరమని అన్నారు. గత కొన్నాళ్లగా ఆ ఇంటి నుంచి తన కుటుంబంతో దూరంగానే ఉంటున్నామని, తన ముందే తన కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులను తీవ్రంగా తిట్టారని, ఇంటిలో ఉండాల్సిన సిసి ఫుటేజీ కెమెరాలు మాయమయ్యాయని, అన్న విష్ణు దుబాయ్‌కు ఎందుకు వెళ్ళాడో అందరికీ తెలుసునని అన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం…
- పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి…
- ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను జూలై 3, 2026కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించిన…
- లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.రైడ్స్ జరగడం… అధికారులు పట్టుబడడం… ఆ తర్వాత కేసులన్నీ నీరుగారిపోవడం… ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ పరిధిలో జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి ఇది. వ్యవస్థను పట్టిపీడిస్తున్న అవినీతి వైరస్‌కు వ్యాక్సిన్ వేయాల్సిన ఏసీబీ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.…
- ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి విదేశాల్లో అదృశ్యమై 45 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఫిన్‌లాండ్‌లో బీటెక్ చదువుతున్న మణిదీప్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడిని క్షేమంగా తిరిగి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 152562