మీడియాపై జరిగిన దాడికి తండ్రి తరఫున క్షమాపణలు చెప్పారు మంచు మనోజ్.. మా నాన్న అంటే నాకు ప్రాణం.. మా నాన్న దేవుడు. మా నాన్నను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారని ఆరోపించారు. మా నాన్న దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారని కన్నీటి పర్యంతమయ్యారు. తాను ఏ తప్పు చేయకపోయినా.. తన వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని.. అందులో తప్పేంటని మనోజ్ ప్రశ్నించారు. పదిమంది కోసం నిలబడ్డానని.. అందుకే తాను చెడ్డగా మారానని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన భార్య కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టామన్నారు. వాటికి కూడా అడ్డంకులు సృష్టించారని, తనపై దాడులు చేశారని మనోజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రి ముందే తనను కొట్టారని.. తనకు సపోర్ట్ చేస్తున్న అమ్మను కూడా డైవర్ట్ చేశారని మనోజ్ ఆరోపించారు. సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తా అన్నారు మంచు మనోజ్.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం…
- పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి…
- ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను జూలై 3, 2026కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించిన…
- లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.రైడ్స్ జరగడం… అధికారులు పట్టుబడడం… ఆ తర్వాత కేసులన్నీ నీరుగారిపోవడం… ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ పరిధిలో జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి ఇది. వ్యవస్థను పట్టిపీడిస్తున్న అవినీతి వైరస్‌కు వ్యాక్సిన్ వేయాల్సిన ఏసీబీ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.…
- ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి విదేశాల్లో అదృశ్యమై 45 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఫిన్‌లాండ్‌లో బీటెక్ చదువుతున్న మణిదీప్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడిని క్షేమంగా తిరిగి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 152799