Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Andhra Pradesh దేశంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా ఖండించారు.

దేశంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా ఖండించారు.

by CVR NEWS

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇటీవల ప్రధాని మోదీ.. పార్లమెంట్ ఉభయసభల్లో ఇరాన్ వార్ తో ఇబ్బందులు తప్పవని, సిద్ధంగా ఉండాలని దేశ ప్రజలకు సూచించారు. అయితే ఈ సూచనను సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారంటూ ఊదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించాల్సి వచ్చింది. దేశంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా ఖండించారు. రాజ్యసభలో 2026 ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ.. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకే ఇలాంటి ఆధార రహితమైన ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో కోవిడ్ తరహా పరిస్థితులు మళ్లీ రావని, ఇంధన కొరత ఏర్పడుతుందనే వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ భారత్‌లో లేదని..పాకిస్తాన్‌లో జరుగుతోందని మంత్రి స్పష్టం చేశారు. మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న పరిణామాల వల్ల కొంత ప్రభావం ఉన్నప్పటికీ, దేశ పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వనరులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: