Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Crime కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.

by CVR NEWS

కాకినాడ జిల్లాలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో తమ కుమార్తెను యువకుడు ఉరివేసి హత్య చేశాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టగా.. న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని మార్చురీ నుంచి తీసుకెళ్లబోమంటూ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు.సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ నాగదుర్గారావు, ఎస్సైతో పాటు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానితుడిగా భావిస్తున్న సందీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఇదిలా ఉంటే, గత ఏడు నెలలుగా లాఫి, సందీప్ మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇద్దరూ మైనర్లు కావడంతో గతంలో ఇంద్రపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, అప్పట్లో వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పంపించారని తల్లిదండ్రులు తెలిపారు.అయితే తమ కుమార్తెను కావాలనే హత్య చేసి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: