Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Andhra Pradesh కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నుంచి ట్రిపుల్ ఐటీలకు ఎంపిక.

కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నుంచి ట్రిపుల్ ఐటీలకు ఎంపిక.

by CVR NEWS

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల్లో సత్తా చాటారు. నియోజకవర్గం నుంచి ఏకంగా 39 మంది విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీలకు ఎంపిక కావడం గర్వకారణమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఎంపికైన విద్యార్థులను సత్కరించి వారి విజయానికి అభినందనలు తెలిపారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి విజయానికి కారణమైన అంశాలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, అమలవుతున్న సంక్షేమ పథకాలపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: