Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Andhra Pradesh చిత్తూరు జిల్లా పలమనేరులో టిడ్కో గృహ బాధితులకు ఊరట.

చిత్తూరు జిల్లా పలమనేరులో టిడ్కో గృహ బాధితులకు ఊరట.

by CVR NEWS
చిత్తూరు జిల్లా పలమనేరులో టిడ్కో గృహ బాధితులకు ఊరట

చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో గతంలో టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకుని, నగదు జమ చేసినప్పటికీ ఇళ్లు రాక ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులకు ఎట్టకేలకు ఊరట లభించింది. అర్హత ఉండి గృహాలు దక్కని లబ్ధిదారులకు, వారు చెల్లించిన నగదును తిరిగి చెల్లించేందుకు పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమరనాథ్ రెడ్డి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ల్యాండ్ వెరిఫికేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని… అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

041940
Total views : 221094

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: