Tuesday, July 21, 2026
News Navigation
Tuesday, July 21, 2026
News Navigation

Breaking

Tuesday, July 21, 2026
Home Latest News మెక్సికోలో భారీ భూకంపం.

మెక్సికోలో భారీ భూకంపం.

by CVR NEWS
Earthquakes

మెక్సికో దక్షిణ పసిఫిక్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో చోటుచోసుకున్న ఈ భూప్రకంపనల ప్రభావం మెక్సికో సిటీతో పాటు ఎల్ సాల్వడార్ వరకు విస్తరించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైంది. గంట వ్యవధిలో నాలుగుసార్లు కంపించింది భూమి. భూకంపం తీవ్రతకు భారీ భవనాలు కూడా షేకయ్యాయి. చియాపాస్ తీరానికి సమీపంలోని అఖిలెస్ సెర్డాన్‌కు నైరుతి దిశగా 48 కిలోమీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రధాన భూకంపానికి ముందు సముద్ర గర్భంలో స్వల్ప స్థాయిలో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

భూకంప తీవ్రతకు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. మెక్సికో, గ్వాటెమాలా సరిహద్దుల్లోని సుచియాటే నగరంలో సునామీ ముప్పు పొంచి ఉందనే అనుమానంతో తీర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మెక్సికో దక్షిణ సరిహద్దులోని కీలక నగరమైన టపచులాలో తొలుత స్వల్పంగా ప్రారంభమైన ప్రకంపనలు, కొద్దిసేపటికే తీవ్రరూపం దాల్చాయి. ఇర గ్వాటెమాలా సిటీలో భూప్రకంపనలు దీర్ఘకాలం పాటు కొనసాగడంతో జనం ఆందోళన చెందారు. మెక్సికో సిటీలోని పలు ప్రాంతాల్లో భవనాలు ఒక్కసారిగా ఊగిపోయాయి. అయితే, భూకంపం సంభవించిన ప్రారంభ క్షణాల్లో దాని తీవ్రత నిర్దేశిత పరిమితిని మించకపోవడంతో ఎర్త్‌క్వేక్ అలర్ట్ సిస్టమ్ మోగలేదని తెలిపింది ప్రభుత్వం.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

041940
Total views : 221094

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: