కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా పార్టీకి సంబంధించిన అంశాలపై మాట్లాడటం సబబు కాదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణిస్తున్నామని.. ఈ వ్యవహారంపై హైకమాండ్ దృష్టి కూడా ఉందన్నారు. ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఆవేదనను అర్థం చేసుకున్నామని.. ఆయన తనకు మంచి మిత్రుడని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.పార్టీకి క్రమశిక్షణే ముఖ్యమని.. వ్యక్తుల కంటే పార్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని అన్నారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్తాయని.. ప్రభుత్వ ప్రధాన నిర్ణయాల్లో పార్టీ పాత్ర కూడా ఉంటుందని తెలిపారు.
రాష్ట్ర అప్పులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించిన మహేష్ కుమార్ గౌడ్.. 2018 నుంచి అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే సీఎం రిలీఫ్ ఫండ్ విడుదలలు జరిగాయని పేర్కొన్నారు. తెలంగాణలో సన్నబియ్యం కార్యక్రమం ప్రత్యేకంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేయిస్తోందని ఆరోపించారు. రానున్న చైర్మన్ పదవుల్లో పాతవారికి 60 శాతం, కొత్తవారికి 40 శాతం అవకాశం ఉంటుందని టీపీసీసీ పేర్కొన్నారు.
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్ కుమార్ గౌడ్.
20
previous post