Wednesday, September 23, 2026
News Navigation
Wednesday, September 23, 2026
News Navigation

Breaking

Wednesday, September 23, 2026
Home Business భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ.

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ.

by CVR NEWS
భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ

ఇక దేశాన్ని పూర్తిగా 5G దేశంగా మార్చడమే తమ లక్ష్యమని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎండీ ఆకాష్ అంబానీ తెలిపారు. జియో నెట్వర్క్ లో ఉన్న వినియోగదారులందరినీ 2030 నాటికి పూర్తిగా 5G నెట్వర్క్ కు మారుస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో జియో 5G యూజర్ల సంఖ్య 26.8 కోట్లకు చేరుకుందని తెలిపారు. చైనా వెలుపల ఒకే దేశంలో ఇంత భారీ స్థాయిలో 5G యూజర్లు ఉన్న ఏకైక టెలికాం ఆపరేటర్ జియో మాత్రమేనని పేర్కొన్నారు.

మరోవైపు కొత్తగా ఏర్పాటు చేయనున్న రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నామని తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ. రిలయన్స్ గిగా కాంప్లెక్స్, కచ్ సోలార్ ఫార్మ్ కలిసి దాదాపు 2 లక్షల గ్రీన్ ఉద్యోగాలు ఇవ్వనున్నాయని తెలిపారు. ఇందులో ఇంజినీర్లు, టెక్నీషియన్లు, ఆపరేటర్లు, నిర్మాణ కార్మికులు, రైతులు, వ్యాపారవేత్తలు ఉంటారని వివరించారు. ఈ క్లీన్ ఎనర్జీ మార్పు పెద్ద స్థాయిలో ఉద్యోగాలు కల్పించడం మాత్రమే కాకుండా, భారత్ ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గిస్తుందని అనంత్ అంబానీ స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: