Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Telangana అమెరికా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

అమెరికా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

by Satya
అమెరికా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆగస్టు 14 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. సీఎం వెంట సీఎస్‌ శాంతికుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు వెళ్లనున్నారు. ఆగస్టు 4న మంత్రి శ్రీధర్‌బాబు, 5న మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా అమెరికా పర్యటనకు బయలుదేరుతారు. వీరు అక్కడ రేవంత్‌ బృందంతో కలుస్తారు. ఈ నెల తొమ్మిదో తేదీ వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్‌ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. అమెరికాలోని ప్రవాస భారతీయులతోనూ సమావేశమవుతారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014723
Total views : 80949

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.