Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Devotional శ్రీ కోదండ రాముని దేవాలయం ఎక్కడ ఉందొ తెలుసా..!

శ్రీ కోదండ రాముని దేవాలయం ఎక్కడ ఉందొ తెలుసా..!

by Satya
Sri Kodanda Rama Temple

అనంతపురం(Anantapur)లోని అతి ప్రాచీనమైన శ్రీరాముడు దేవాలయాల్లో(Sri Rama Temples) ఒకటి శ్రీ కోదండ రాముని దేవాలయం(Sri Kodanda Rama Temple). ఈ దేవాలయం అనంతపురం నగరంలోని పాతూరులో సున్నపు గేర్ల వద్ద కలదు. దాదాపుగా 300 సంవత్సరాల పై చిలుకు క్రితమే నిర్మించబడి ఉన్నదని ఇక్కడే చరిత్ర, పురోహితుల ద్వారా తెలుస్తోంది. ఈ దేవాలయం మొదటగా అనంతపురం నగరానికి చెందిన కోనేటి వంశస్థుల ద్వారా నిర్మించబడినది అని చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. అయితే మొదటగా ఈ ప్రాంతం పంట పొలాలతో ఉండేదని ఇక్కడ ఒక చెరువు కూడా నిర్మించబడి ఉండాలని ఆ చెరువు కట్ట పైన నిర్మించబడి ఉన్న మొదటిగా ఈ కోదండరాముడు దేవాలయమును ఆ తర్వాత కోనేటి వంశస్థులు దీనిని నిర్మించి అభివృద్ధి చేశారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

ఇంతటి చరిత్ర గల కోదండరాముని దేవాలయమును భక్తులు భక్తిశ్రద్ధలతో నిష్టుతో పూజిస్తూ ఉంటారు. ఇక్కడ దేవాలయంలో శ్రీరామునికి అర్చనలు, భజనలు, కీర్తనలు మరియు ఉట్ల పరస ఘనంగా నిర్వహిస్తారు. ఇంతటి చరిత్ర గల దేవాలయమును దేవాదాయ శాఖ గుర్తించి వీటి నిర్వహణ ఈ శాఖ ద్వారానే నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయంలో స్థాపితమైన సీతారాముని విగ్రహం , లక్ష్మణుడి విగ్రహం ఎంతో తేజస్సుతో దర్శనమిస్తారు. ఇక్కడ నవగ్రహాల పూజలు చేయడానికి కూడా నవగ్రహాల విగ్రహాలు ఉన్నాయి. ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఇక్కడ ఎంతో తేజస్తో దర్శనమిస్తుంది. వేపచెట్టు బోధి వృక్షం రెండూ కలిసి ఇక్కడ వెలిసాయి. ఈ చెట్లకు పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. అంతేకాక శ్రీ కోదండ స్వామికి ఇక్కడ నిత్యం పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ శ్రీరాముని కొలిచినవారి కోరికలను స్వామివారు తప్పకుండా నెరవేస్తారని ఎంతోమంది భక్తులు గాఢంగా విశ్వసిస్తారు.


  • తిరుపతి జిల్లా రామచంద్రాపురం శ్రీ శక్తి పీఠంలో ఘనంగా వారాహి ఉత్సవాలు.
    తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం శ్రీ శక్తి పీఠంలో శ్రీ వారాహి అమ్మవారి ఆషాఢ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు, వారాహి మంత్ర హోమాల్లో…
  • శ్రీనివాస మంగాపురంలో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం.
    తిరుపతి రూరల్ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో కొలువుదీరిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీవేంకటేశ్వరస్వామివారు నడిచిన పవిత్ర మార్గంగా భక్తులు విశ్వసించే చారిత్రక ప్రాధాన్యత ఉన్న శ్రీవారిమెట్టు ప్రాంతంలో…
  • భద్రాచలంలో మంత్రి పొంగులేటి పర్యటన.
    భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై ఫోకస్‌ పెట్టింది ప్రభుత్వం. పనులను వేగవంతం చేసేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి ..భద్రాద్రి శ్రీ సీతారామచంద్రులను దర్శించుకొని, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

042274
Total views : 223704

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: