Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Andhra Pradesh ఏపీ ప్రజలకు … నేటి నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్స్

ఏపీ ప్రజలకు … నేటి నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్స్

by Rama
ఏపీ ప్రజలకు ... నేటి నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్స్

ఏపీలో నేటి నుండి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల బుకింగ్‌ ప్రారంభమయింది. దీపావళి రోజున ఈ పథకాన్ని ”దీపం” పేరుతో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ కోసం లబ్దిదారులు ఆన్‌ లైన్లో, ఆఫ్‌ లైన్లో బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దీపం పథకం కింద ముందు పూర్తి ధరను చెల్లించిన తర్వాత సిలిండర్‌ ఖర్చును లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయనున్నారు.

ఏడాదిలో ప్రతీ కుటుంబానికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న కూటమి ప్రభుత్వం .. ఈరోజు తొలి సిలిండర్‌ బుక్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. లబ్దిదారులు ఈరోజు నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేది వరకు ఈ ఫ్రీ గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకోవచ్చు. పొందవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటికే ఫ్రీ గ్యాస్‌ సిలిండర్ల పంపిణికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్‌ కంపెనీలు, పౌర సరఫరాల శాఖతో కలిసి లబ్దిదారుల ప్రత్యేక ఖాతాలో ఈ నిధులను జమ చేయనున్నారు.

గ్యాస్‌ కనెక్షన్‌, తెల్ల రేషన్‌ రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు ఉన్న కుటుంబాలు అర్హులు అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. అలాగే నిరుపేద కుటుంబాలకు మాత్రం అమలవుతుందా లేక ధనికులకు కూడా అమలు చేస్తారా అన్న విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయలేదు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.
    హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా దేశంలోకి చొరబడిన వీరు… కొంతకాలంగా ఇక్కడే ఉంటూ…
  • స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.
    విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
  • మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.
    మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు లక్ష…
  • కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.
    కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో చిన్నారితో వెళ్లిన పెంపుడు కుక్క తోట నుంచి తిరిగొచ్చిన తర్వాత మృతి చెందడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి జాహ్నవి వెంట వెళ్లి తిరిగి వచ్చిన కుక్క.. రెండ్రోజులుగా…
  • ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.
    వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమ‌వుతున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్‌, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ,…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

023291
Total views : 141722

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.