భారీ వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాల బాధితులను ఆదుకునేందుకు సినీ, రాజకీయ అనే తేడా లేకుండా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ వంతు సాయం చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏకంగా 6కోట్ల భారీ విరాళంతో ఉదారత చాటారు. ఇందులో తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి ప్రకటించిన జనసేనాని.. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో కోటి ఇచ్చారు. అలాగే ఏపీలో వరద బారిన పడ్డ 400 పంచాయితీలకు లక్ష చొప్పున 4 కోట్లు ప్రకటించారు. ఇలా విపత్కర పరిస్థితుల్లో గొప్ప మనసు చాటిన పవన్‌పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వరద ప్రాంత ప్రజల కోసం భారీ విరాళం ప్రకటించిన డిప్యూటీ సీఎంను అభినందించారు. వరదల కారణంగా కష్టాల్లో ఉన్న ప్రజలకు భారీ విరాళం ఇవ్వడం జనసేనాని విశాల హృదయానికి అద్దం పడుతుందని సీఎం కొనియాడారు. తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు జనసేనాని భారీ విరాళం. ప్రజలకు ఆయన చేస్తున్న సేవలకు విలువ కట్టలేమని తెలిపారు. దాతృత్వాన్ని ప్రదర్శించడంలో తనకు తానే సాటిగా ప్రవర్తించే పవన్ కల్యాణ్ సమాజంలో ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ప్రజలకు ఆయన చేస్తున్న సేవలకు విలువ కట్టలేం. అదే విధంగా ఆయన కురిపిస్తున్న వాత్సల్యానికి ఏదీ సరితూగదు. ఆయనకు మరో సారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని సీఎం చంద్రబాబు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది. హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా దేశంలోకి చొరబడిన వీరు… కొంతకాలంగా ఇక్కడే ఉంటూ…
- స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న 15 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి… మరికొందరిని బదిలీ చేసింది. నాసిరకం మెటీరియల్ కొనుగోలు, పర్యావేక్షణ లోపం, ముందస్తు భద్రతా చర్యలు…
- మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు లక్ష…
- కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో చిన్నారితో వెళ్లిన పెంపుడు కుక్క తోట నుంచి తిరిగొచ్చిన తర్వాత మృతి చెందడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి జాహ్నవి వెంట వెళ్లి తిరిగి వచ్చిన కుక్క.. రెండ్రోజులుగా…
- ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 141750