ఢిల్లీకి చేరుకున్న లగచర్ల ఫార్మా లడాయి … లగచర్ల ఫార్మా పరిశ్రమ బాధిత కుటుంబాలు ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ ను కలిసి తమపై రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు చేసిన దాడులు, అరెస్టులపై బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేయనున్నాయి. వారికి మద్దతుగా ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ హస్తినకు చేరుకున్నారు. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ముఖ్య నాయకులు ఢిల్లీకి చేరుకున్నారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం కొడంగల్ లో ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణకు పూనుకున్నారు.
ఈ క్రమంలో కొందరు రైతులు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై దాడి చేసిన లగచర్ల తో పాటు పరిసర గ్రామాల్లోని గ్రామస్థులను అరెస్ట్ చేసింది. తమపై జరిగిన దాడిని ఇది వరకే తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన బాధితులు నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..ప్రపంచ రక్షణ రంగంలో వ్యూహాత్మక సమీకరణాలను పూర్తిగా మార్చే సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. రష్యా తన అత్యంత అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌గా పేరుగాంచిన S-500ను పూర్తి సాంకేతిక బదిలీతో భారత్‌లోనే తయారు చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ రక్షణ…
- పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …టాలీవుడ్లో ప్రముఖ స్టార్ హీరో రా కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్‌ని అలరించారు. ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాల్ని చేస్తూ, డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాల్ని తీస్తూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు మంచు మనోజ్. అలాంటి హీరో తన…
- గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “ఆర్ కే దీక్ష”. డి.ఎస్. రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ, జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి…
- ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు ఇంట్లో ఐదారుగురు ఉంటేనే సందడి..సందడిగా ఉంటుంది. అలాంటిది అక్కడ ఏకంగా 181 మంది నివసిస్తున్నారు. అలాగని అది హాస్టల్ కాదు… కుటుంబం..! ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం..! చిన్న కుటుంబం…
- పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బూర్గంపాడు మండలం ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు .నీటి నిల్వ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 80982